Cauliflower vs Broccoli : బ్రోకలీ vs కాలీఫ్లవర్… ఈ రెండిటిలో ఏది ఆరోగ్యానికి మంచిది.. నిపుణుల అభిప్రాయం ఏమిటంటే..!
ప్రధానాంశాలు:
Cauliflower vs Broccoli : బ్రోకలీ vs కాలీఫ్లవర్... ఈ రెండిటిలో ఏది ఆరోగ్యానికి మంచిది.. నిపుణుల అభిప్రాయం ఏమిటంటే..!
Cauliflower vs Broccoli : బ్రోకలీ మరియు కాలీఫ్లవర్ ఈ రెండు కూడా చూడడానికి ఒకేలా ఉంటాయి. అయితే వీటిలో ఒకటి తెల్లగా ఉంటే మరొకటి ఆకుపచ్చ కలర్ లో ఉంటుంది. అయితే ఈ వెజిటేబుల్ అనేది చాలా ప్రత్యేకమైనది. అలాగే ప్రస్తుతం ఆరోగ్య స్పృహ ఉన్నటువంటి వారు ఈ వెజిటేబుల్ ను తీసుకోవటం మరింత ఎక్కువ అయ్యింది. అయితే బ్రోకలి ని తీసుకోవడం నిజంగా ఆరోగ్యానికి మంచిదేనా.? లేక కాలిఫ్లవర్ మంచిదా? ఈ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
నిజం చెప్పాలంటే బ్రోకలీలో విటమిన్ సి మరియు విటమిన్ కే, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. ఇది జీర్ణ రుగ్మతలను తగ్గించడానికి మరియు శరీరం మొత్తం రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎంతో హెల్ప్ చేస్తుంది. అలాగే ఈ బ్రోకలి అనేది గుండె ఆరోగ్యానికి కూడా మెరుగుపరుస్తుంది. అయితే ఒక కప్పు బ్రోకలి లో మూడు నుండి మూడున్నర గ్రాముల కాల్షియం అనేది ఉంటుంది. దీనిని మీరు నిత్యం కచ్చితంగా తీసుకుంటే ఎముకల ఆరోగ్యాన్ని పెంచడంలో చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే బ్రోకలి ని తీసుకోవడం వలన ఆక్సీకరణ హార్మోన్ల స్రావాన్ని కూడా పెంచుతుంది. అయితే ఈ హార్మోన్ స్రవించడం వలన ఒత్తిడి అనేది తగ్గి అలసట దూరం అవుతుంది. అలాగే కాలీఫ్లవర్ లో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. దీనిలో కూడా విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. అలాగే దీనిలో విటమిని కే ఎక్కువగా ఉంటుంది. అందుకే దీనిని తినడం వలన ఎముకల ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది. అయితే చాలా మందిలో రక్తం గడ్డ కట్టే సమస్యలు ఉంటాయి. వీటికి కాలీఫ్లవర్ బెస్ట్. అలాగే కాలీఫ్లవర్ లో కోలిన్ అనేది ఉంటుంది. అయితే ఈ కొలీన్ అనేది మన శరీరంలో కి సరైన మోతాదులో వెళితే మంచి నిద్ర అనేది వస్తుంది.
ఈ కాలిఫ్లవర్ అనేది జ్ఞాపకశక్తికి మరియు కండరాలకు రక్త ప్రసరణను పెంచడానికి కూడా హెల్ప్ చేస్తుంది. అయితే కాలీఫ్లవర్ లేదా బ్రోకలీ ఈ రెండిటిలో ఏది తింటే మంచిది అనే ప్రశ్న వచ్చినప్పుడు, నిపుణుల అభిప్రాయ ప్రకారం చూస్తే, బ్రోకలీ మరియు కాలీఫ్లవర్ ఈ రెండిటిని తీసుకుంటే శరీరానికి మంచి జరుగుతుంది అని అంటున్నారు. అయితే మన శరీరానికి ఏ రకమైన పోషకాలు అవసరమో దాని ప్రకారమే కూరగాయలను తీసుకోవాలి. అలాగే శరీరంలో విటమిన్లు లేక ఫైబర్ లోపల ఉన్న వారికి మాత్రం బ్రోకలీ చాలా మంచిది. అలాగే మీరు బరువు తగ్గటానికి తక్కువ కేలరీలు కావాలి అంటే మాత్రం కాలీఫ్లవర్ తీసుకుంటే మంచిది