Exams : పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న పిల్లలు వీటిని తప్పకుండా తీసుకుంటే.. జ్ఞాపకశక్తి ,ఏకాగ్రత పెరుగుతుంది..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Exams : పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న పిల్లలు వీటిని తప్పకుండా తీసుకుంటే.. జ్ఞాపకశక్తి ,ఏకాగ్రత పెరుగుతుంది..!!

 Authored By prabhas | The Telugu News | Updated on :16 March 2023,7:00 am

Exams : చాలామంది పిల్లలు పరీక్ష సమయంలో ఎంత చదివినా గుర్తుండదు. ఇంకొందరు ఎంత చదివిన గుర్తు ఉండడం లేదని చాలా సతమతమవుతూ ఉంటారు. పరీక్షలలో విజయం సాధించాలంటే ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడే పిల్లలు అనుకున్న లక్ష్యాలను చేరుకోగలుగుతారు. పరీక్షల సమయంలో తప్పకుండా ఆరోగ్యకరమైన భోజనం ,స్నాక్స్ తీసుకోవడం వల్ల పిల్లలు మరింత జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. ప్రధానంగా అల్పాహారం రోజంతటి ప్రభావం చూపుతుంది. అల్పాహారం మానేయడం శరీరానికి మంచిది కాదు. ఎక్కువ కాలం ఉపవాసం ఉండటం వల్ల బ్లడ్లులో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి.

Children who are preparing for exams must take these

Children who are preparing for exams must take these

ఇది మీ పిల్లల ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇక పరీక్షల ఒత్తిడి చాలామంది పై పడుతుంది. కావున పరీక్షకు ముందు కడుపునిండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం చాలా ప్రధానం పిల్లల మెదడు సమర్థవంతంగా షార్ప్ గా పని చేయడానికి ఎన్నో పోషకాలు ఉన్న ఆహారాన్ని తప్పకుండా తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం.. ఆరోగ్యకరమైన ఆహారం; పిల్లలు హైడ్రేటుగా ఉండేలా చూసుకోవాలి. డిహైడ్రేషన్ అల్సర్ కలిగేలా చేస్తుంది. పరీక్ష రాయడానికి ఆటంకం కలుగుతూ ఉంటుంది. పిల్లలు తేలికగా జీర్ణం అవ్వడానికి తక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. మీ పిల్లల ఆహారంలో ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఇవ్వాలి.

7 Ways to Stay Focused During Exam Season - Explico Blog

ఉప్పు, చక్కెర తగ్గించాలి. ఎందుకంటే ఇవి బరువు పెరగడానికి సహాయపడతాయి. అలాగే చిప్స్ ,చాక్లెట్స్, స్నాక్స్, పిజ్జా బర్గర్లు, వడపావు, సమోసాలు ఇలాంటివి ప్యాక్ చేసిన ఆహారాలను మానుకోవాలి. అలాగే టిఫిన్ ఉండే ఆహార పదార్థాలు కూడా తీసుకోవద్దు. డ్రింక్స్ ఫ్రూట్ జ్యూస్ పండ్ల రసం తీసుకోవద్దు. వాటికి బదులుగా తాజా పండ్లను తీసుకోవడం చాలా ఆరోగ్యకరం. అరటిపండు మంచి శక్తి ఇస్తుంది. శరీరానికి పూర్తి పోషకాలను అందేలా చేస్తుంది. బ్లడ్ లో షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి మానసిక గందరగోళాన్ని తగ్గించడానికి అరటి పండ్లను పరీక్షలు సమయంలో తప్పకుండా తీసుకోవాలి. అజీర్ణం, ఉబ్బరం ఇలాంటివి తగ్గించుకోవడానికి అధిక ఫైబర్ ఆహారం తీసుకోవాలి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది