Curry tree Amla : కరివేపాకు, ఉసిరి… ఈ రెండిటిని కలిపి తీసుకుంటే… ఈ వ్యాధులన్నీ పరార్…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Curry tree Amla : కరివేపాకు, ఉసిరి… ఈ రెండిటిని కలిపి తీసుకుంటే… ఈ వ్యాధులన్నీ పరార్…?

 Authored By ramu | The Telugu News | Updated on :17 July 2025,11:00 am

Curry tree Amla : ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారమే దానికి ముఖ్య కారణం. ప్రతిరోజు చేసే తప్పులే మనకు అనారోగ్యాన్ని తెచ్చిపెడతాయి. ప్రతి ఆహారం విషయంలో తగు జాగ్రత్త అవసరం. ఆరోగ్యాన్ని పొందాలంటే సరైన ఆహారపు అలవాట్లు చేసుకోవడంలో కీలక పాత్రను పోషిస్తుంది. అయితే, న్యూట్రిషనిస్ట్ దీప్ శిఖ జైన్, ఆహారాల విభిన్న కలయికల ద్వారా లభించే అద్భుత ప్రయోజనాలు గురించి తెలియజేస్తున్నారు. యూకే నుండి గ్లోబల్ పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్లో ఎంఎస్సీ చేసిన దీప్ శిఖ ఉసిరి, కరివేపాకు గురించి పలు కీలక విషయాలను తెలియజేశారు. తన ఇన్ స్టాగ్రామ్ పోస్టులో, ఈ రెండు పదార్థాలు కలిపి తీసుకోవడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఏమిటో వివరించారు. ప్రతి వ్యక్తి కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలని కోరుకుంటారు. కానీ ఈ రోజుల్లో అది సాధ్యం కావడం లేదు. కారణం ప్రతిరోజు ఆహారపు విషయాలలో చేసే పొరపాట్లే. న్యూట్రిషనిస్ట్ దీప్ శిఖ జైన్, హారాల విభిన్న కలయికల ద్వారా లభించే అద్భుత ప్రయోజనాల గురించి వివరించారు. యూకే నుండి గ్లోబల్ పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్లో ఎంఎస్సీ చేసిన దీప్ శిఖ.ఉసిరి,కరివేపాకుల గురించి పలు కీలక విషయాలని తెలియజేశారు.ఇతను ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేసి, రెండు పదార్థాలను కలిపి తీసుకుంటే కలిగే ప్రయోజనాల గురించి తెలియజేశారు.

Curry tree Amla కరివేపాకు ఉసిరి ఈ రెండిటిని కలిపి తీసుకుంటే ఈ వ్యాధులన్నీ పరార్

Curry tree Amla : కరివేపాకు, ఉసిరి… ఈ రెండిటిని కలిపి తీసుకుంటే… ఈ వ్యాధులన్నీ పరార్…?

Curry tree Amla ఉసిరి, కరివేపాకుతో ప్రయోజనాలు

ఆరోగ్యకరమైన జుట్టు: ఉసిరిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. కరివేపాకులో బీటా కెరోటిన్ ఉంటుంది. ఈ రెండిటిని కలిపి తీసుకుంటే జుట్టు ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకా బలం కూడా చేకూరుతుంది. అని న్యూట్రిషన్ నిస్ట్ తెలిపారు. మీ జుట్టు నిజంగా మెరుగుపడాలన్నా, బలోపేతం చేసుకోవాలన్నా,ఇంకా అకాల జుట్టు తెల్లబడడాన్ని తగ్గించుకోవాలన్నా, ఇది ఒకటే మార్గం అన్నారు ఆమె.

డయాబెటిస్ నియంత్రణ : ఈ రెండిటి డయాబెటిస్ ని నియంత్రించవచ్చు. రక్తంలో చక్కర స్థాయిలను సంవర్ధవంగా నిర్వహించగలదు.ఈ రెండు ఫైబర్ నీ కలిగి ఉంటుంది. అంటే పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలో వేగంగా పెరగకుండా నిరోధించబడుతుంది అని న్యూట్రిషన్ నిస్ట్ పేర్కొన్నారు.

యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా : కరివేపాకు,ఉసిరి రెండు యాంటీ ఆక్సిడెంట్లకు నిలయమని చెప్పవచ్చు. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, విటమిన్ ఈ కరోటి నాయకులు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి అని దీప్ శిఖ తెలిపారు. కణాలను రోజువారి నష్టం నుండి రక్షించడానికి సహకరిస్తుంది. ఇంకా యాంటీ ఆక్సిడెంట్లు వాపులను తగ్గించగలదు. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచగలదు.చర్మానికి కాంతిని ఇస్తుంది అని న్యూట్రిషన్ నిస్ట్ తెలిపారు.

ఎలా ఉపయోగించాలి : కరివేపాకు, ఉసిరిని కలిపి తీసుకోవడం ఉత్తమ మార్గమని న్యూట్రిషన్ నిస్ట్ సూచించారు. మీరు దీన్ని ఒక షార్ట్ గా తాగవచ్చు. లేదా మీ కూరగాయల జ్యూస్లో కలుపుకోవచ్చు అని ఆమె సలహా ఇచ్చారు.ఈ సులభమైన చిట్కా, మీ రోజు వారి ఆహారంలో ఈ శక్తివంతమైన కలయికను చేర్చుకోవడానికి సహకరిస్తుంది అని ఆమె తెలిపారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది