Amla Juice | ఉదయం ఖాళీ కడుపుతో ఉసిరి-మునగ రసం తాగండి.. అద్భుతమైన ఆరోగ్య ఫలితాలు మీ సొంతం! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Amla Juice | ఉదయం ఖాళీ కడుపుతో ఉసిరి-మునగ రసం తాగండి.. అద్భుతమైన ఆరోగ్య ఫలితాలు మీ సొంతం!

 Authored By sandeep | The Telugu News | Updated on :1 November 2025,12:45 pm

Amla Juice | ఉదయం మనం తినే మొదటి ఆహారం శరీరంపై పెద్ద ప్రభావం చూపుతుంది. అందుకే వైద్య నిపుణులు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని సిఫారసు చేస్తుంటారు. సాధారణంగా చాలామందికి ఉదయం వేడి టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కానీ, నిపుణుల ప్రకారం ఆ అలవాటు మానేసి, ఉసిరికాయ–మునగ రసం (Amla–Drumstick Juice) తాగితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.

#image_titl

జీర్ణక్రియకు మేలు

ఉసిరికాయ–మునగ రసం జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. ఖాళీ కడుపుతో తాగినప్పుడు జీర్ణశక్తి పెరుగుతుంది. కడుపులో వ్యర్థాలు తొలగించి, ప్రేగులను శుభ్రం చేస్తుంది. మలబద్ధకం సమస్యలు తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

రోగనిరోధక శక్తి పెంపు

ఉసిరికాయలో విటమిన్ C పుష్కలంగా ఉంటుంది. మునగ ఆకుల్లో ఇనుము, కాల్షియం, జింక్, విటమిన్ A లాంటి ముఖ్య పోషకాలు ఉన్నాయి. వీటి సమ్మేళనం రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి, ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది.

చర్మ కాంతి కోసం సహజ టానిక్

ఈ రసంలోని యాంటీఆక్సిడెంట్లు చర్మంలోని మృత కణాలను తొలగించి, నల్ల మచ్చలను తగ్గిస్తాయి. ఉసిరిలోని విటమిన్ C చర్మానికి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి, చర్మం ప్రకాశవంతంగా మారేలా చేస్తుంది.

రక్తంలో చక్కెర నియంత్రణ

ఉసిరికాయ, మునగ, కరివేపాకు గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించే గుణాలు కలిగి ఉన్నాయి. ఇది మధుమేహ రోగులకు ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా అల్పాహారం తర్వాత తాగితే రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది