Diabetes : నీటితో షుగర్ వ్యాధికి చెక్ పెట్టవచ్చు… అది ఎలాగో తెలుసా..?
Diabetes : ప్రస్తుతం మనం జీవిస్తున్న జీవన శైలిలో కొన్ని మార్పుల వలన చాలామంది డయాబెటిస్ అనే సమస్యతో సతమతమవుతున్నారు. ఈ షుగర్ వ్యాధి ఎంతో ప్రమాదకరమైనది. ఇది ఒక్కసారి వచ్చిందంటే జీవితాంతం ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడవల్సిందే. అయితే ప్రణాళిక ప్రకారం ఆహారం తీసుకోవడం, నిద్ర పోవడం, లాంటి ఎన్నో కారణాలు ఉంటాయి, అయితే షుగర్ వ్యాధి నుంచి ఉపశమనం కలగడానికి చాలామంది మెడిసిన్ నుంచి ఆయుర్వేదం వరకు అన్నిటిని వాడుతున్నారు. అయితే షుగర్ బాధితులు ఈ మందుల వినియోగంతో పాటు మంచినీటిని తీసుకోవడం వలన బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నీటిని అధికంగా తీసుకోవడం వలన శరీరంలో అవసరానికి మించి ఉండే గ్లూకోజ్ ను మూత్రం ద్వారా బయటికి పంపించడం జరుగుతుంది.
ప్రధానంగా షుగర్ వ్యాధిగ్రస్తులు వేషవి కాలంలో డిహైడ్రేషన్ కి గురకాడకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు వహించాలని అలాగే నీటిని అధికంగా త్రాగాలని అంటున్నారు. అయితే నీటిని ఏ విధంగా తీసుకోవాలి.. ఏ టైం లో తీసుకోవాలి.. ఎంత తీసుకోవాలి.. అనే వివరాలు ఇప్పుడు మనం చూద్దాం.. వాటర్ లెవెల్స్ ట్రాకింగ్: ఎండాకాలం ఈ సీజన్లో షుగర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా డిహైడ్రేషన్ కి గురవుతూ ఉంటారు. కావున శరీరంలో నీటి శాతం ఎంత ఉందో నిరంతరం చెక్ చేసుకుంటూ ఉండాలి. దీనివలన డిహైడ్రేషన్ కి గురవ్వకుండా ఉంటారు… నీళ్ల బాటిల్ ఎప్పుడు వెంట ఉంచుకోవాల్సిందే… డయాబెటిస్ వచ్చిన తర్వాత రోజు తమ వెంట నీళ్ల బాటిల్ ని తీసుకెళ్లాలి. బయటికి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు నీటిని తీసుకోవాలి. దాని వలన డిహైడ్రేట్ సమస్య నుంచి బయటపడవచ్చు.. కాస్త భిన్నంగా: ఎవరికైనా సరే సాధారణ నీటిని పదేపదే తాగడం కాస్త ఇబ్బందిగా ఉంటుంది.
అటువంటి టైంలో ఆ వాటర్ లో నిమ్మకాయ గాని, దోసకాయ ఇతర పండ్ల ముక్కలను కలుపుకొని త్రాగవచ్చు. ఇది కాస్త టేస్ట్ గా ఉండడంతోపాటు ఎక్కువ నీటిని తాగడానికి అనుగుణంగా ఉంటాయి. రిమైండర్లు పెట్టుకోవాలి: కొంతమంది పనిలో పడి నీటిని తాగడం మర్చిపోతూ ఉంటారు. అటువంటి పరిస్థితిలో స్మార్ట్ వాచ్ స్మార్ట్ ఫోన్లు రిమైండర్లను పెట్టుకోవాలి. అలా నీటిని గంటకో, అర్థగంటకు ఒకసారి తాగుతూ ఉండాలి. భోజనానికి ముందు నీటిని తాగాలి: షుగర్ బాధితులు భోజనానికి ముందు నీటిని తాగాలని అంటున్నారు. ఆరోగ్య నిపుణులు అయితే ఇంట్లో కాకుండా బయట తిన్నా సరే నీటిని తాగాలని చెబుతున్నారు. అల్పాహారం చేసే సమయంలోను అనేకసార్లు నీళ్లు తాగాలని ఆరోగ్య నిపుణులు తెలపడం జరిగింది. అటువంటి ఆహారమే తీసుకోవాలి: మధుమేహ బాధితులు రోజు తీసుకునే ఆహారం నీటి శాతం అధికంగా ఉండే పదార్థాల్ని ఎక్కువగా తీసుకోవాలి. దాని వలన శరీరానికి శక్తి కూడా అందుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.