Diabetes Control Tips : డయాబెటిస్ వారికి సరైన ఆహార నియమాలు ఇవే.. మీకు కచ్చితంగా ఉపయోగపడతాయి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Diabetes Control Tips : డయాబెటిస్ వారికి సరైన ఆహార నియమాలు ఇవే.. మీకు కచ్చితంగా ఉపయోగపడతాయి..!

 Authored By ramu | The Telugu News | Updated on :20 October 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Diabetes Control Tips : డయాబెటిస్ వారికి సరైన ఆహార నియమాలు ఇవే.. మీకు కచ్చితంగా ఉపయోగపడతాయి..!

Diabetes Control Tips : డయాబెటిస్ తో బాధపడే వారికి ఏది తినాలి ఏది తినకూడదు అనేది ఒక క్లారిటీ ఉండదు. డాక్టర్ సలహా మేరకు డైట్ పాటిస్తున్నా చుట్టూ ఉండే వారు ఒక్కొక్కరు ఒక్కోటి చెబుతుంటారు. ఐతే డయానెటిస్ వారు ఎలాంటి డైట్ పాటించాలి. అసలు ఎలాంటి ఫుడ్ తినాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది ఇప్పుడు చూద్దాం. ఫ్యాంక్రియాస్ తక్కువ చెక్కరను ఉత్పత్తి చేసినప్పుడు, శరీరంలో ఇన్సులిన్ సరిగా ఉత్పత్తి కానప్పుడు డయాబెటిస్ వస్తుంది. ఆ టైం లో రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. అందుకే షుగర్ పేషంట్స్ కి డైట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు.

డయాబెటిస్ ఉన్న వారు అతిగా తినకూడదని డాక్టర్లు చెబుతారు. అందుకే వారు ఏం తినాలన్నా సరే ఆలోచిస్తారు. ఐతే డ్రై ఫ్రూట్స్ కొన్నిటి వల్ల షుగర్ నార్మల్ రేంజ్ కి వచ్చే అవకాశం ఉంటుంది. బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇలా అరగంట ముందు ఈ డ్రై ఫ్రూట్ ట్రై చేస్తే షుగర్ నార్మల్ గా ఉంటుంది. ఇంతకీ అదేంటి అంటే భోజనానికి అరగంట ముందు బాదం పప్పు తింటే బ్లడ్ లో షుగర్ లెవెల్స్ నార్మల్ గా ఉంటాయని తెలుస్తుంది.

Diabetes Control Tips రక్తంలో చక్కెరను కంట్రోల్ చేయడం..

బాదంలో ఉన్న మోనో-ఎన్ సంతృప్త కొవ్వు ఇంకా గుడ్ ఫైబర్ ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఇది రక్తంలో చక్కెరను కంట్రోల్ చేయడంలో బాగా ఉపయోగపడుతుంది. భోజనం చేశాక బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. దీన్ని కంట్రోల్ చేయడానికే ఏదైనా తినే అరగంట ముందు 20 గ్రాముల బాదం తింటే మంచిదని డాక్టర్లు చెబుతున్నారు.

Diabetes Control Tips డయాబెటిస్ వారికి సరైన ఆహార నియమాలు ఇవే మీకు కచ్చితంగా ఉపయోగపడతాయి

Diabetes Control Tips : డయాబెటిస్ వారికి సరైన ఆహార నియమాలు ఇవే.. మీకు కచ్చితంగా ఉపయోగపడతాయి..!

ఐతే తినే బాదంపప్పు కూడా అలా పచ్చిదే కాకుండా నాన బెట్టి పొట్టు తీసి తినాలి. బాదం ఎప్పుడు పొట్టుతో తినకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది