Diabetes : వాకింగ్‌తో డయాబెటిస్ కంట్రోల్..?.. ఈ వ్యాధి నుంచి ఉపశమనం ఇలా పొందండి..
Diabetes : దేశంలో డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు రోజురోజుకూ పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతీ ఒక్కరు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, ఆహారపు అలవాట్లపైన జాగ్రత్తలు వహించాలని పెద్దలు చెప్తున్నారు. కాగా, వాకింగ్ చేయడం వల్ల మధుమేహం కంట్రోల్‌లోకి వస్తుందా..మధుమేహం వ్యాధి నుంచి ఉపశమనం పొందడానికి ఏ పద్ధతులు ఫాలో కావాలనే విషయాలను గురించి తెలుసుకుందాం.జనరల్‌గా మధుమేహం అనేది మనుషులకు శారీరక శ్రమ లేకపోవడం వల్ల వస్తుందని పెద్దలు, వైద్యులు వివరిస్తున్నారు. దాంతో పాటు వేపుడు కూరలు, ఆహార పదార్థాలు బేకరీ ఐటమ్స్ ఇతరాలు తీసుకోవడం
వలన మధుమేహం రావడానికి గల కారణాలని అంటున్నారు. ఈ క్రమంలోనే వాటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇకపోతే గర్భవతులలో రెండు నుంచి ఐదు శాతం వరకు మధుమేహం వచ్చే అవకాశాలుంటాయి. ఈ వ్యాధి తల్లి ద్వారా బిడ్దలకు వచ్చే అవకాశాలున్న నేపథ్యంలో సరైన వైద్యం తీసుకోవాలి.ప్రతీ రోజు వాకింగ్ చేయడం ద్వారా డయాబెటిస్ అదుపులోకి తీసుకురావచ్చు. నైట్ టైమ్స్‌లో ఫుడ్ తీసుకున్న తర్వాత వాకింగ్ చేయడం ద్వారా డయాబెటిస్ కంట్రోల్‌లోకి వచ్చినట్లు పరిశోధకులు తెలిపారు. వాకింగ్ ద్వారా మనుషులకు శారీరక, మానసిక ఉల్లాసం లభిస్తుందని చెప్పారు.
Diabetes : ఈ పద్ధతులతో మధుమేహం అదుపులోకి..
మధుమేహం నుంచి ఉపశమనం పొందాలనుకునే వారు వెల్లుల్లి కంపల్సరీగా యూజ్ చేయాలి. వెల్లుల్లి యూసేజ్ వల్ల చాలా చక్కటి ప్రయోజనాలున్నాయి. ఆస్తమా, శ్వాస పీల్చుకోవడం వంటి ఇతర సమస్యలన్నిటికీ వెల్లుల్లి చెక్ పెడుతుంది. బ్లడ్ లోని షుగర్ లెవల్స్ కంట్రోల్ చేయడంలోనూ వెల్లుల్లి కీ రోల్ ప్లే చేస్తుంది.వెల్లుల్లి మానవ శరీరంలోని రకరకాల వ్యాధుల నుంచి రక్షణ కలిగిస్తుంది. వెల్లుల్లిని పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. మన పూర్వీకులు వెల్లుల్లిని చాలా చక్కగా ఉపయోగిస్తున్నారు. ప్రతీ రోజు మార్నింగ్ టైంలో రెండు వెల్లుల్లి రెబ్బలను నేరుగా నమిలి తీసుకుంటే కనుక చాలా చక్కటి ప్రయోజనాలుంటాయని ఆరోగ్య నిపుణులు, పెద్దలు చెప్తున్నారు.