Diabetes : డయాబెటీస్ పేషెంట్స్ సమ్మర్ లో ఈ డ్రింక్స్ తీసుకోవాలి …. !
Diabetes : మధుమేహం ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మంది మధుమేహంతో బాధపడుతున్నారు. మధుమేహంతో బాధపడేవారు చక్కెర స్ధాయిలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి. సరైన జీవనశైలి లేకపోవడం, ఆహారపు అలవాట్ల వల్ల వచ్చే వ్యాధి. ఇందులో ఆహారం నియంత్రించకపోతే, రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. డయాబెటిక్ పేషెంట్లు ప్రతి సీజన్‌లో ఆహారం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి.సమ్మర్ లో అయితే మరిన్ని జాగ్రత్తలు పాటించాలి. తప్పకుండా టైంకి బోజనం చేయాలి. తీసుకునే ఆహారంలో అత్యధికంగా చిరుధన్యాలు కొర్రలు, అరికలు, సామలు మొదలైన ముడి ధాన్యాలు ఉండేలా చూసుకోవాలి. రెఫైండ్ చేయని పదార్థాలతో పాటు అన్నిరకాల కూరగాయలు, ఆకు కూరలు, మొలకెత్తిన గింజలు ఎక్కువగా తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు దుంప కూరలకు దూరంగా ఉండాలి. భోజనంలో అన్నము, రొట్టెల కన్నా ఉడికించిన కూరగాయలు ఎక్కువ మోతాదులో ఉండేలా చూసుకోవాలి
వేసవి కాలంలో మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారం జీర్ణం కావడానికి చాలా ఇబ్బంది పడతారు. ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే, రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరగడం ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ సీజన్‌లో డయాబెటిక్ రోగులు ఆహారంలో ఎక్కువ ఫైబర్ ఆహారాన్ని తీసుకోవాలి. ఫైబర్ ఫుడ్ అటువంటి ఆహారాన్ని సూచిస్తుంది.. దీనిలో నీటి పరిమాణం కూడా సరిపోతుంది. వేసవిలో చక్కెరను అదుపులో ఉంచుకోవడానికి మీ ఆకలిని తీర్చే, చక్కెరను నియంత్రించే పండ్లను ఎంచుకోండి.పండ్లలో ఆపిల్, దానిమ్మ, జామ, నారింజ, బత్తాయి మరియు బొప్పాయి పండ్లు తీసుకోవాలి. జ్యూసెస్, బేకరీ పదార్థాలు, కూల్ డ్రింక్స్ కి దూరంగా ఉండాలి . పండ్లను తినడం వల్ల అందులోని పీచు పదార్థాలు రక్తంలోని చక్కర శాతాన్ని తగ్గించి, ఆరొగ్యకరమైన కొవ్వులను పెంచి, జీర్నశక్తిని పెంపొందిస్తాయి. అలాగే ఫ్రీ మోషన్ కు సహకరిస్తాయి. పండ్లలో మామిడి, అరటి, ద్రాక్ష, సపోటా మరియు సీతాఫలం లో చక్కర శాతం అధికంగా ఉంటుంది. వాటి విషయంలో జాగ్రత వహించాలి.

Diabetes patients summer season by drinking these 5 diabetic friendly drinks
Diabetes : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి
రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవడానికి వేసవిలో డీహైడ్రేషన్‌ను నివారించడానికి శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడం చాలా ముఖ్యం. సమ్మర్ లో రెండు నుంకచి మూడు లీటర్ల నీరు తప్పకుండా తాగాలి. దోసకాయలో ఫైబర్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి, ఇది సహజంగా శరీరంలో ఇన్సులిన్ మొత్తాన్ని పెంచుతుంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. శరీరాన్ని వేడి నుంచి కూడా కాపాడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు అల్పాహారంలో ఒక చెంచా జామూన్ వెనిగర్‌ను అర గ్లాసు నీటిలో కలుపుకుని తాగితే రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉండటంతో పాటు శరీరం చల్లగా ఉంటుంది.తిప్పతీగ మొక్క ఆకులు చక్కెరను నియంత్రించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్న తిప్పతీగ శరీరం నుంచి హానికరమైన పదార్థాలను తొలగిస్తుంది. పొట్లకాయ రసం వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుతుంది, అలాగే బరువును అదుపులో ఉంచుతుంది.