Diabetes : డయాబెటిస్ బాధితులకు గాయాలు తగ్గిపోవడానికి ఎక్కువ సమయం ఎందుకు పడుతుందో మీకు తెలుసా.? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Diabetes : డయాబెటిస్ బాధితులకు గాయాలు తగ్గిపోవడానికి ఎక్కువ సమయం ఎందుకు పడుతుందో మీకు తెలుసా.?

 Authored By aruna | The Telugu News | Updated on :6 August 2022,4:00 pm

Diabetes : ప్రస్తుతం చాలామంది మధుమేహంతో ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఈ మధుమేహంతో బాధపడుతున్న వారికి దీనితోపాటు ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అంటే ఈ మధుమేహ బాధితులలో షుగర్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి. వారు తీసుకునే ఆహారంలో మార్పుల వలన ఇలా షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. అలా పెరిగినప్పుడు దీంతో పాటు ఇంకా కొన్ని సమస్యలు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. ఈ షుగర్ లెవెల్స్ పెరగడం వలన కిడ్నీల మీద బాగా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. అదేవిధంగా ఎముకలు కూడా గుల్ల పారిపోతూ ఉంటాయి.

అలాగే ముఖ్యంగా ఈ డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు కొన్ని గాయాలు అయినప్పుడు అవి తగ్గడానికి చాలా సమయం పడుతుంది. అది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం. ఇలా గాయాలు తొందరగా మానకపోవడానికి కారణం అధికంగా షుగర్ లెవెల్స్ పెరిగిపోవడం, అందువలన గాయం నయం అవడానికి ఎక్కువ టైం పడుతుంది. ఈ డయాబెటిక్ బాధితులకు గాయమైన ప్రదేశంలో సరియైన ఆక్సిజన్ ఉత్పత్తి జరగకపోవడం, ఎర్ర రక్త కణాలు సరియైన వేగంతో గాయం దగ్గరికి చేరకపోవడం. అలాగే ఆ గాయం ప్రదేశంలో రక్త ప్రసరణ అనేది జరగకపోవడం, ఇలాంటివన్నీ గాయం తగ్గకపోవడానికి కారణాలు గా పరిగణించబడ్డాయి.

Diabetes sufferers take longer for wounds to heal

Diabetes sufferers take longer for wounds to heal

అయితే గాయాన్ని తొందరగా తగ్గించడం ఎలా.? ఈ డయాబెటిస్ బాధితులు ముందుగా షుగర్ లెవల్స్ ను క్రమం తప్పకుండా చెక్ చేయించుకుంటూ ఉండాలి. గాయం అయిన ప్రదేశం ఇప్పుడు శుభ్రపరుస్తూ ఉండాలి. అదేవిధంగా గాయపడిన ప్రదేశం దగ్గర పదేపదే ఆ గాయాన్ని తాకడం మర్చిపోండి. అలాగే చేతులు కాళ్లు ప్రతిరోజు నాలుగైదు సార్లు సబ్బుతో కడుగుతూ ఉండాలి. అదేవిధంగా ఆ గాయం పై యాంటీబయోటిక్ క్రీమ్ ను రాయండి. అదేవిధంగా కట్టు కూడా కట్టుకోవచ్చు. ఇలా చేస్తూ ఉన్న కూడా గాయం మానడానికి ఎక్కువ సమయం పడుతుంది. అంటే వైద్య నిపుణులను తప్పకుండా సంప్రదించాలి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది