Diabetes : డయాబెటిస్ ఉన్నవారు దీన్ని త్రాగారంటే… డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు…
Diabetes : ప్రస్తుతం చాలామంది డయాబెటిస్ సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి కారణం జీవనశైలిలో వచ్చిన మార్పులు, సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం, పనిలో ఒత్తిడి ఇలా ఎన్నో కారణాల వలన డయాబెటిస్ బారిన పడుతున్నారు. షుగర్ ని కంట్రోల్ చేసుకోవడానికి వివిధ రకాల మందులను వాడుతుంటారు. డయాబెటిస్ ఉన్నవారు కచ్చితంగా ఆహార నియమాలను పాటించాలి. వీరు ఏది పడితే అది తినకూడదు. చక్కెర వ్యాధిగ్రస్తులు ఎక్కువగా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉండేలా ఆహార పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆహార పదార్థాలతో పాటు ఈ జ్యూస్ ని ప్రతిరోజు తాగడం వలన చక్కెర వ్యాధి నియంత్రణలోకి వస్తుంది.
అయితే డయాబెటిస్ ని కంట్రోల్ చేసే ఆహార పదార్థాలు ఏమిటో, ఆ జ్యూస్ ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. డయాబెటిస్ ను నియంత్రించడంలో క్యారెట్, అల్లం, గ్రీన్ ఆపిల్, దాల్చిన చెక్క ఎంతగానో సహాయపడతాయి. వీటిలో ఉండే పోషకాలు, ఔషధ గుణాలు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడతాయి. వీటితో జ్యూస్ తయారు చేసుకొని తాగితే మంచి ఫలితం ఉంటుంది. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక క్యారెట్, ఒక గ్రీన్ ఆపిల్ ను ముక్కలుగా చేసి వేసుకోవాలి. తర్వాత ఇందులోనే రెండు ఇంచుల అల్లం ముక్కలు వేసుకోవాలి. తర్వాత రెండు దాల్చిన చెక్క ముక్కలను, ఒక టీ స్పూన్ నిమ్మరసం, ఒక గ్లాసు నీళ్లు వేసి మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న జ్యూస్ ను వడకట్టకుండానే త్రాగాలి.
ఈ జ్యూస్ ను ప్రతిరోజు త్రాగడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ప్రతిరోజు ఈ జ్యూస్ ని తీసుకోవడం వలన ఇతర ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఈ జ్యూస్ ను తాగడం వలన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి వివిధ రకాల రోగాల బారిన పడకుండా కాపాడుతుంది. గుండె ఆరోగ్యంగా పనిచేస్తుంది. కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుముఖం పడతాయి. అలాగే జీర్ణ సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి. అధిక రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది. ఇలా జ్యూస్ చేసుకొని త్రాగలేనివారు ఆయా ఆహార పదార్థాలను తినే ఆహారంలో భాగంగా తరచూ తీసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది.