Agarbatti Stick : మీరు పూజ గదిలో వెలిగించే ఈ అగర్బత్తి… సిగరెట్ కంటే డేంజర్ తెలుసా…ఈ వ్యాధి వస్తుందట..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Agarbatti Stick : మీరు పూజ గదిలో వెలిగించే ఈ అగర్బత్తి… సిగరెట్ కంటే డేంజర్ తెలుసా…ఈ వ్యాధి వస్తుందట..?

 Authored By ramu | The Telugu News | Updated on :26 July 2025,7:00 am

ప్రధానాంశాలు:

  •  Agarbatti Stick : మీరు పూజ గదిలో వెలిగించే ఈ అగర్బత్తి... సిగరెట్ కంటే డేంజర్ తెలుసా...ఈ వ్యాధి వస్తుందట..?

Agarbatti Sticks : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా పూజ గదిలో అగరవత్తులను వెలిగించి పూజలు చేస్తూ ఉంటారు. అయితే,మీరు వెలిగించే అగరవత్తులు ఎలాంటివో తెలుసుకోవాలి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు నిపుణులు. ఇంట్లో వెలిగించినప్పుడు సువాసన వెదజల్లుతూ ఉంటుంది.అలాగే సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. ధూపం వేసినట్లు చాలా హాయిగా అనిపిస్తుంది. ఎక్కువగా ఈ అగరబత్తులను సాంస్కృతిక కార్యక్రమాలలో ఉపయోగిస్తుంటారు. అగర్భతులు సువాసన,ఆ పోగ ఆహ్లాదకరంగా మార్చడంతో ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది అని నమ్ముతారు. పండుగల వాతావరణం వచ్చిందంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా అగరవత్తులు సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి. అలాగే పొగలు కూడా ధూపం లాగా ఇల్లంతా వ్యాప్తి చెందుతాయి. పండుగలు వేడుకలు ప్రారంభమైనప్పుడు ఇంకా, నాగపంచమి తర్వాత ఒకదాని తర్వాత ఒకటి పండుగలు రానున్నాయి. అటువంటి పరిస్థితుల్లో మతపరమైన ఆచారాల సమయంలో ధూపం, అగరబత్తి, సాంబ్రాణి వంటి సుగంధ ద్రవ్యాలను వెలిగిస్తూ ఉంటారు. సాంప్రదాయకంగా వివిధ మతమరమైన సంస్కృతి కార్యక్రమాలను ఉపయోగించి, అగర్బత్తి ధూపం లాంటివి సువాసన వెదజల్లుతూ అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తూ ఉంటుంది. మనకు ఇది ఉల్లాసాన్ని కలిగిస్తుంది.అంతేకాదు,ఇంట్లో మంచి సువాసన కూడా వచ్చేలా చేస్తుంది. సుగంధ అగర్బత్తులను వెలిగిస్తారు.అయితే ఈ అగర్బత్తుల సువాసన వెదజల్లి అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది.

Agarbatti Stick మీరు పూజ గదిలో వెలిగించే ఈ అగర్బత్తి సిగరెట్ కంటే డేంజర్ తెలుసాఈ వ్యాధి వస్తుందట

Agarbatti Stick : మీరు పూజ గదిలో వెలిగించే ఈ అగర్బత్తి… సిగరెట్ కంటే డేంజర్ తెలుసా…ఈ వ్యాధి వస్తుందట..?

ప్రశాంతతను కలిగిస్తుందంటారు. కానీ అగర్బత్తి పొగతో ప్రాణాలకు కూడా ముప్పు ఉందని మీకు తెలుసా. అగరవత్తుల పొగ సిగరెట్ కంటే కూడా హానికరమని ఒక అధ్యయనంలో వెల్లడించారు నిపుణులు.ఈ పొగ ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధికి గురి చేస్తుందని సంచలన విషయాలు వెల్లడించారు నిపుణులు. ఈ పరిశోధనలో సిగరెట్, అగర్బత్తుల పొగ వల్ల కలిగే నష్టాలపై తులనాత్మక అధ్యయనం జరిగింది. ఈ సమయంలో అగరబత్తుల పొగ నమూనాలు 99% అల్ట్రా ఫైన్ సూక్ష్మ కణాలు కనుగొన్నారు.ఈ విషయాలు శరీరానికి హాని కలిగిస్తాయి. ఈ పరిశోధనలను సౌత్ చైనా, యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, చైనా టొబాకో, గ్యాంగ్ డాంగ్ ఇండస్ రైల్వే కంపెనీ సంయుక్తంగా నిర్వహించాయి. ధూపద్రవ్య పొగ పై జరిగిన ఈ అధ్యయనం ప్రకారం..ధూపం వేసిన తరువాత పొగతో పాటు కొన్ని సూక్ష్మ కణాలు కూడా విడుదలవుతాయి. ఈ కణాలు గాలిలో కలిసిపోతాయి. ధూప ద్రవ్య కర్రల నుండి విడుదలయ్యే విషయ కణాలు శరీర కణాలపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయి.

Agarbatti Stick క్యాన్సర్ ప్రమాదం

అధ్యయనాల ప్రకారం ధూపం పొగలో ఊపిరితిత్తుల క్యాన్సర్కు కారణమయ్యే మూడు రకాల ప్రత్యేక పదార్థాలు ఉన్నాయి. ఈ విష పదార్థాలను మ్యూటాజెనిక్, జేనోటాక్సిక్, సైటో టాక్సిక్ అంటారు. కర్రల నుండి వెలువడే పొగ ఆరోగ్యానికి చాలా హానికరం. ఇది మన ఊపిరితిత్తులలో మంట, చికాకు,వివిధ రకాల రుగ్మతులకు కారణం అవుతుంది. ధూపం పొగ వాయు మార్గాలలో దురద, చికాకును కూడా కలిగిస్తుంది.

కళ్ళకు హానికరం : ఈ దూపపు పొగలో హానికరమైన రసాయనాలు,కళ్ళల్లో దురద, చికాకు, చర్మా ఎలర్జీలు వంటి సమస్యలను తెచ్చిపెడుతుంది. ఈ పొగ వల్ల కంటి సమస్యలతో పాటు చూపు కోల్పోయే ప్రమాదం కూడా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది