Diet Soda : డైట్ సోడాను ఎక్కువగా తాగుతున్నారా… ప్రాణాలు ప్రమాదంలో పడ్డట్టే…!!
Diet Soda : మీకు డైట్ సోడా తాగే అలవాటు ఉన్నదా. అయితే మీరు వెంటనే దీనిని మానేయండి. ఈ డైట్ సోడాతో అనర్ధాలు తప్పవు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే ఈ సోడాలు తాగటం వలన స్ట్రోక్ రిస్క్ మూడు రెట్లు వరకు పెరుగుతుంది అని అంటున్నారు పరిశోధకులు. అయితే ఈ డైట్ సోడాలో కేలరీలు మరియు చక్కెరలు ఉండవు అనే ప్రచారం అవాస్తవం అని అంటున్నారు. నిజం చెప్పాలంటే ఇది కార్బోనేటెడ్ సిరప్ అని […]
ప్రధానాంశాలు:
Diet Soda : డైట్ సోడాను ఎక్కువగా తాగుతున్నారా... ప్రాణాలు ప్రమాదంలో పడ్డట్టే...!!
Diet Soda : మీకు డైట్ సోడా తాగే అలవాటు ఉన్నదా. అయితే మీరు వెంటనే దీనిని మానేయండి. ఈ డైట్ సోడాతో అనర్ధాలు తప్పవు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే ఈ సోడాలు తాగటం వలన స్ట్రోక్ రిస్క్ మూడు రెట్లు వరకు పెరుగుతుంది అని అంటున్నారు పరిశోధకులు. అయితే ఈ డైట్ సోడాలో కేలరీలు మరియు చక్కెరలు ఉండవు అనే ప్రచారం అవాస్తవం అని అంటున్నారు. నిజం చెప్పాలంటే ఇది కార్బోనేటెడ్ సిరప్ అని అంటున్నారు. అలాగే కృత్రిమంగా మిస్టరీ ఇన్ గ్రీడెంట్స్ తో తయారు చేసింది అని అంటున్నారు నిపుణులు. అలాగే కేలారీల వాడకాన్ని తగ్గించే శరీర సహజ సామర్థ్యాన్ని కృత్రిమ స్వీటెనర్లు నాశనం చేస్తాయి. ఇది ప్రేగుల్లో బ్యాక్టీరియాను కూడా మారుస్తాయి.
అలాగే ఇన్సులిన్ సెన్సిటివిటీని మారుస్తాయి. అయితే ఈ డైట్ సోడా లో ఉన్న ఆర్టిఫిషియల్ స్వీట్ టెనర్లు వలన ఆకలి అనేది బాగా పెరిగి తీపి పదార్థాలను ఎక్కువగా తీసుకునేందుకు ప్రేరేపిస్తుంది. దీని వలన శరీర బరువు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది అని అంటున్నారు నిపుణులు.ఈ డైట్ సోడాలకు ప్రత్యామ్నాయంగా హెర్బల్ టీలు మరియు మంచినీరు మరియు సహజమైన ఫ్లేవర్డ్ వాటర్ తాగితే మంచిది అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంకొక వైపు డైట్ సోడాతో టైప్ టు డయాబెటిస్ ప్రమాదం ఉంది అని అంటున్నారు పరిశోధకులు. ఈ డైట్ డ్రింక్ ను ప్రతిరోజు తాగటం వలన స్ట్రోక్ ప్రమాదం మూడింతల వరకు పెరుగుతుంది అని పరిశోధకులు అంటున్నారు.
అలాగే డీమోన్షియా ముప్పు కూడా పొంచి ఉంది అని అంటున్నారు నిపుణులు. అయితే దీనిపై ఇంకా మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉంది అని అన్నారు. ఈ డైట్ సోడాలను అధికంగా తీసుకునే వారు ఊబకాయం మరియు మధుమేహ ప్రమాదం కూడా ఉంది అని అంటున్నారు. అలాగే కిడ్నీ దెబ్బతినే అవకాశం కూడా ఉంది అని అన్నారు. అంతేకాక ఎముకలు బలహీనం మరియు దంత సమస్యలు మరియు జీర్ణ సమస్యలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి అని అన్నారు.