Water : నీరు లేకుండా మానవుడు ఎన్ని రోజులు జీవించగలడు… నిపుణులు ఏం చెబుతున్నారు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Water : నీరు లేకుండా మానవుడు ఎన్ని రోజులు జీవించగలడు… నిపుణులు ఏం చెబుతున్నారు…!

 Authored By ramu | The Telugu News | Updated on :19 June 2024,4:00 pm

Water : నీరు అనేది మానవ శరీరానికి చాలా అవసరం. కొంత మొత్తంలో నీరు అనేది శరీరం సక్రమంగా పని చేసేందుకు ఎంతో మేలు చేస్తుంది. ఈ నీరు లేకుండా మనం మన జీవితాన్ని ముందుకు సాగించలేము. మనిషి ఆహారం లేకుండా ఎన్నో రోజులు జీవిస్తాడు. కానీ నీరు లేకుండా జీవించడం మాత్రం చాలా కష్టం అవుతుంది. అలాంటి పరిస్థితులలో ఒక వ్యక్తి నీరు అనేది లేకుండా ఎన్ని రోజులు జీవించగలడు. నీటి కొరత కారణం వలన ఏమి జరుగుతుంది అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తింది…

Water నీటి కొరత కారణంగా

ఒక వ్యక్తి డీ హైడ్రేషన్ కు గురైనప్పుడు అతను ఎంతో దాహంతో ఉంటాడు. నీటి కొరత కారణం వలన అతనికి అలసిపోయినట్లుగా అనిపిస్తుంది. అతని అవయవాలపై కూడా ఎంతో ఎఫెక్ట్ పడుతుంది. అంతేకాక ఇది మరణానికి కూడా దారితీస్తుంది. నీరు తాగకపోతే ఆ వ్యక్తి ఫస్ట్ రోజు కొంచెం నీరసంగా ఉంటాడు.అయితే మూడవ రోజుకిమాత్రం అతని అవయవాలు అనేవి దెబ్బతినే అవకాశం ఉంది అని వైద్యులు తెలిపారు. నీటి కొరత ప్రభావం అనేది ప్రతి వ్యక్తిపై కూడా భిన్నంగా ఉంటుంది. మానవ శరీరం 70 శాతం వరకు నీటితో నిర్మితమై ఉండటం వలన ఎన్నో ముఖ్యమైన పనులు వాటి వలన జరుగుతాయి. అలాంటి పరిస్థితుల్లో నీరు లేకుండా ఎక్కువ కాలం జీవించటం అనేది అంత సులభమైన పని కాదు..

Water నీరు లేకుండా మానవుడు ఎన్ని రోజులు జీవించగలడు

ఇది వేరు వేరు వ్యక్తులకు భిన్నంగా కూడా ఉండొచ్చు. ఇది రెండు రోజుల నుండి వారం రోజుల వరకు కూడా ఉండవచ్చు. నీటికి సంబంధించి రూల్ ఆఫ్ 3గా కూడా చెబుతారు. అంటే మనిషి మూడు నిమిషాల పాటు గాలి లేకుండా, మూడు రోజులు నీరు లేకుండా,మూడు వారాల పాటు ఆహారం లేకుండా బ్రతకగలడు. ఆహారం నీరు లేకుండా మనిషి 8 నుండి 21 రోజులు కంటే ఎక్కువ కాలం జీవించలేడు. ఆర్కేవ్ ఫర్ క్రిమినాలజీ అధ్యయనం తెలిపింది. నీరు లేకపోవడం వలన శరీరంపై ఎన్నో ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. అయితే ఇదంతా కూడా మన జీవనశైలి మరియు వాతావరణం పై ఆధారపడి ఉంటుంది.

Water నీరు లేకుండా మానవుడు ఎన్ని రోజులు జీవించగలడు నిపుణులు ఏం చెబుతున్నారు

Water : నీరు లేకుండా మానవుడు ఎన్ని రోజులు జీవించగలడు… నిపుణులు ఏం చెబుతున్నారు…!

శరీరానికి ఎంత నీరు అవసరం : 1.జాతీయ విద్యా వెతల ప్రకారం చూస్తే, పురుషులు 3.6 లీటర్ల నీరు, మహిళలు 2.6 లీటర్ల నీటిని తీసుకోవాలి. ఈ పరిణామాన్ని ద్రవం లేక ఆహారం నుండి కూడా పొందవచ్చు..

2. నీటి అవసరమనేది ప్రతి వ్యక్తి వయసు శారీరక, శ్రమ,ఆరోగ్యం,శారీరక సామర్థ్యం,ఎత్తు, బరువు, లింగం మరియు ఆహారం మీద కూడా ఆధారపడి ఉంటుంది..
3. నీరు ఎక్కువగా ఉండే పండ్లు మరియు కూరగాయలు, రసాలను తాగేవారికి అధిక నీరు అవసరం లేదు. కానీ దృణధాన్యాలు, బ్రెడ్డు లేక డ్రై ఫ్రూట్స్ తీసుకునే వారికి మాత్రం అధిక నీరు ఎంతో అవసరం..
4. ఒక వ్యక్తి శరీరానికి ఎంత నీరు అవసరం అనేది కూడా అతని చుట్టూ ఉన్నటువంటి వాతావరణం పై కూడా ఆధారపడి ఉంటుంది..

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది