Egg : వీటితో కలిపి గుడ్డు తింటున్నారా… అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నట్లే… జాగ్రత్త..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Egg : వీటితో కలిపి గుడ్డు తింటున్నారా… అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నట్లే… జాగ్రత్త..!

 Authored By ramu | The Telugu News | Updated on :31 December 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Egg : వీటితో కలిపి గుడ్డు తింటున్నారా... అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నట్లే... జాగ్రత్త..!

Egg : ప్రతిరోజు ఉడికించిన కోడిగుడ్డు Eggs తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే వైద్య నిపుణులు సైతం రోజుకి ఒక గుడ్డు తీసుకోవడం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుందని సూచిస్తున్నారు. అయితే ఆరోగ్యానికి మంచిది కదా అని ఎలా పడితే అలా కోడి గుడ్లను తిన్నట్లయితే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉందట. మరి ముఖ్యంగా ఉడికించిన కోడిగుడ్లను కొన్ని రకాల ఆహారాలతో కలిపి తీసుకోవడం వలన అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉడికించిన కోడిగుడ్డులో ప్రోటీన్ కాలుష్యం వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. అందుకే ప్రతిరోజు ఆహారంలో కోడిగుడ్లను చేర్చుకోవడం వలన ఆరోగ్యంలో ఎన్నో మార్పులు కనిపిస్తాయి. అంతేకాక ఉడికించిన గుడ్లలో ఎక్కువ మొత్తంలో ఆమ్లాలు లీన్ ప్రోటీన్లు ఉంటాయి. అలాగే దీనిలో ఉండే తక్కువ క్యాలరీ కంటెంట్ బరువు తగ్గడానికి ఎంతగానో సహాయపడుతుంది. అందుకే ప్రతిరోజు కోడిగుడ్డు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సైతం చెబుతుంటారు. కానీ కొన్ని రకాల ఆహారాలతో కోడిగుడ్డు అసలు తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి అవేంటో ఇప్పుడు చుదాం…

Egg వీటితో కలిపి గుడ్డు తింటున్నారా అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నట్లే జాగ్రత్త

Egg : వీటితో కలిపి గుడ్డు తింటున్నారా… అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నట్లే… జాగ్రత్త..!

Egg : అరటిపండు…

కోడిగుడ్డును అరటిపండుతో కలిపి అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే అరటిపండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రెండు పదార్థాలను కలిపి తీసుకున్నట్లయితే శరీరంలో పొటాషియం మరియు కాల్షియం నిష్పత్తి విపరీతంగా పెరుగుతుంది. దీంతో ఎముకలు దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెండు కలిపి అసలు తీసుకోకూడదు.

సోయా పాలు : సోయపాలతో కలిపి గుడ్లను ను తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ రెండు ఆహార పదార్థాలలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. కావున ఈ రెండిటిని కలిపి తీసుకున్నట్లయితే ప్రోటీన్లు విపరీతంగా పెరిగి జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

కోడి మాంసం : ప్రస్తుత కాలంలో చాలామంది కోడి మాంసంతో పాటు గుడ్లను ఎక్కువగా తీసుకుంటున్నారు. కానీ ఇలా చేయడం అస్సలు మంచిది కాదట. ఈ విధంగా తినడం శరీరంపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కావున జాగ్రత్త వహించాలి.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది