Tea : టీ ఎక్కువగా మరిగించి త్రాగకండి… ఈ సమస్యలు వస్తాయి…! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Tea : టీ ఎక్కువగా మరిగించి త్రాగకండి… ఈ సమస్యలు వస్తాయి…!

Tea : ప్రతి ఒక్కరు కూడా ఉదయం లేవగానే టీ లేక కాఫీ తాగుతూ ఉంటారు. చాలా మందికి కాఫీ తాగనిదే రోజు గడవదు. అందుకే చాయ్ అన్నింటికి మెడిసిన్ లాగా పని చేస్తుంది. కావున చిరాకుగా ఉన్న కాస్త పని ఒత్తిడి నుండి రిలీఫ్ పొందాలి అన్న కచ్చితంగా చాయ్ తాగాల్సిందే. అయితే ప్రతిరోజు తాగే వాళ్లకు కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు ఆరోగ్య నిపుణులు. టీ అధికంగా మరిగించకూడదు అని తెలిపారు. ఎందుకో రీజన్స్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :1 June 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Tea : టీ ఎక్కువగా మరిగించి త్రాగకండి... ఈ సమస్యలు వస్తాయి...!

Tea : ప్రతి ఒక్కరు కూడా ఉదయం లేవగానే టీ లేక కాఫీ తాగుతూ ఉంటారు. చాలా మందికి కాఫీ తాగనిదే రోజు గడవదు. అందుకే చాయ్ అన్నింటికి మెడిసిన్ లాగా పని చేస్తుంది. కావున చిరాకుగా ఉన్న కాస్త పని ఒత్తిడి నుండి రిలీఫ్ పొందాలి అన్న కచ్చితంగా చాయ్ తాగాల్సిందే. అయితే ప్రతిరోజు తాగే వాళ్లకు కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు ఆరోగ్య నిపుణులు. టీ అధికంగా మరిగించకూడదు అని తెలిపారు. ఎందుకో రీజన్స్ కూడా తెలిపారు. టీ ని పాలతో కలిపి తాగటం వలన మన బాడికి లభించే ఎనర్జీ అనేది చాలా సేపు టీ ని మరగపెట్టినప్పుడు నశిస్తాయంట అలాగే టీ లో టానిన్లు అనే సహజ రసాయనాలు కూడా ఉన్నాయి. కావున టీ ని ఎక్కువసేపు మరిగించటం వల్ల వాటి సాంద్రత అనేది పెరిగి బా డీ పై వ్యతిరేక ప్రభావం అనేది చూపుతాయి అంటున్నారు. దీని కారణంగా శరీరంలోని ఐరన్ గ్రహించలేక పోతుంది అంట. అంతేకాక మరికొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి అని అంటున్నారు ని పణులు..

టీ ని ఎక్కువ సేపు మరిగించటం వలన పెరిగిన టానిన్ల సాంద్రత జీర్ణ సమస్యలు కూడా దారి తీస్తుంది అని అంటున్నారు ని పునులు. ముఖ్యంగా చెప్పాలంటే. ఎక్కువ టానిన్లు తీసుకోవటం వల్ల వికారం, కడుపునొప్పి, మలబద్ధకం లాంటి జీర్ణ సమస్యలు వస్తాయని అంటున్నారు. టీ ని ఎక్కువసేపు మరిగించటం వలన ఏర్పడిన కొన్ని రసాయనాలు క్యాన్సర్ కారకాలను కూడా ప్రోత్సహిస్తాయి అంట. టీ ని ఎక్కువసేపు మరిగించటం వలన ఏర్పడిన కొన్ని రసాయనాలు క్యాన్సర్ కారకాలను ప్రోత్సహిస్తాయి. కావున 2013లో న్యూట్రిషనల్ రీసెర్చ్ అనే జర్నల్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే. టీ ని ఎక్కువ సేపు మరిగించటం వల్ల జీర్ణ సమస్యలు మరియు ఐరన్ లోపానికి దారి తీస్తుంది అని కనుక్కున్నారు. అయితే ఈ రీసెర్చ్ బిజింగ్ లోని వైద్య విశ్వవిద్యాలయానికి చెందినటువంటి ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ యువాన్ అనే వ్యక్తి పాల్గొన్నారు.

Tea టీ ఎక్కువగా మరిగించి త్రాగకండి ఈ సమస్యలు వస్తాయి

Tea : టీ ఎక్కువగా మరిగించి త్రాగకండి… ఈ సమస్యలు వస్తాయి…!

ఎక్కువ సేపు టీ ని మరిగించటం వలన ఏర్పడే టానిన్లు శరీరంలో ఐరన్ సం గ్రహాన్ని అడ్డుకుంటాయి అని అంటున్నారు. జీర్ణ సమస్యలు కూడా కలిగిస్తాయి అని తెలిపారు. టీ ని ఎక్కువసేపు మరిగించటం వలన పాలలో ఉండే కాలుష్యం, విటమిన్లు, విటమిన్ బి, బి12 సి లాంటివి కూడా ఆశిస్తాయి అని అంటున్నారు. ఈ టీలో కెఫెన్ అనే పదార్థం ఉంటుంది. కావున టీ ని ఎక్కువ సేపు మరిగించినప్పుడు కెఫీన్ అనేది చేదు రుచులు ఇస్తుంది. ఇలా అధిక కేఫిన్ తీసుకోవడం వలన ఆందోళన, నిద్రలేమి, గుండె దడ లాంటి సమస్యలు కూడా వస్తాయి అంటున్నారు. టీ లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించడంలో కూడా ఎంతో సహాయం చేస్తాయి. దీని ఎక్కువసేపు మరిగించినప్పుడు ఇది కూడా నాశనం అవుతాయి అని అంటున్నారు నిపుణులు. మొత్తానికి పాలతో టీ ని తయారు చేసుకునేవారు ఎలాంటి పరిస్థితుల్లో కూడా మూడు నుండి ఐదు నిమిషాల కు మించకుండా మరిగించాలి అని అంటున్నారు నిపునులు…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది