Burgers : బేకరీ ఫుడ్ పిజ్జా,బర్గర్లు తెగ తినేస్తున్నారా…? ఇక ఈ విషయం తెలిస్తే జన్మలో కూడా తిననే తినరు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Burgers : బేకరీ ఫుడ్ పిజ్జా,బర్గర్లు తెగ తినేస్తున్నారా…? ఇక ఈ విషయం తెలిస్తే జన్మలో కూడా తిననే తినరు..!

 Authored By ramu | The Telugu News | Updated on :12 December 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Burgers : బేకరీ ఫుడ్ పిజ్జా,బర్గర్లు తెగ తినేస్తున్నారా...? ఇక ఈ విషయం తెలిస్తే జన్మలో కూడా తిననే తినరు..!

Burgers : నేటి సమాజంలో చాలామంది ఫాస్ట్ ఫుడ్ కి అలవాటు పడిపోతున్నారు. ఈ ఫాస్ట్ ఫుడ్ లో ముఖ్యంగా పిజ్జాలు, బర్గర్లు. వీటిని ఒక టైం అంటూ లేకుండా ఏ టైం పడితే అప్పుడు తినేస్తూ ఉంటున్నారు. ఇలాంటి వారి కోసం పరిశోధనలో ఒక షాకింగ్ న్యూస్ చెప్పారు నిపుణులు. పిజ్జాలు,బర్గర్లు, మోమోస్ అంటే అనారోగ్యకరమైన ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం వల్ల 50 సంవత్సరాలు లేదా ఇంతకంటే తక్కువ వయసు ఉన్న వారికి జీర్ణ క్యాన్సర్, పెద్ద ప్రేవు క్యాన్సర్, వచ్చే ప్రమాదం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడించారు.

Burgers బేకరీ ఫుడ్ పిజ్జాబర్గర్లు తెగ తినేస్తున్నారా ఇక ఈ విషయం తెలిస్తే జన్మలో కూడా తిననే తినరు

Burgers : బేకరీ ఫుడ్ పిజ్జా,బర్గర్లు తెగ తినేస్తున్నారా…? ఇక ఈ విషయం తెలిస్తే జన్మలో కూడా తిననే తినరు..!

ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని ప్లీoడర్స్ యూనివర్సిటీలో రెడ్ మీట్, ప్రాసెస్డ్ మీట్, ఫాస్ట్ ఫుడ్,షుగర్ డ్రింక్స్, ఆల్కహాల్ వంటి అనారోగ్యకరమైన ఆహార పదార్థాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై, పరిశోధనలు నిర్వహించగా వీటిని తీసుకోవడం వల్లే అధికంగా క్యాన్సర్ బారిన పడుతున్నారని తేలింది. అలాగే బర్గర్లు, పిజ్జాలు,మెమోస్ వంటి బేకరీ ఫుడ్ తీసుకోవడం వల్ల శరీరంలో మంట కూడా వస్తుంది అంట. దీనివల్ల క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం పెద్ద ప్రేమ్ క్యాన్సర్ కేసులు పెరుగుదల 50 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయసు ఉన్న వారికి ఎక్కువగా కనిపిస్తున్నాయంట.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రాసెస్ చేసిన ఆహారం, వేయించిన ఆహారాలు, చెక్కర పానీయాలు, క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని తెలియజేశారు. ఎందుకంటే ఈ ఆహారాల్లో కొవ్వు, చక్కెర అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో మంటని మరియు క్యాన్సర్ కారకాలను పెంచుతాయి.ఈ ఫాస్ట్ ఫుడ్ రసాయనాలు,కృత్రిమ సంకలి తలాలను కలిగి ఉంటాయి. ఇది జీవ క్రియల్లో అసమతుల్యత చేస్తాయి. ఇవి ఆరోగ్యకరమైన కణాలను దెబ్బతీయటమే కాక క్యాన్సర్ కలిగించే కణాలను ఎక్కువగా పెంచుతాయి. ఫాస్ట్ ఫుడ్ ఫుడ్ అయినా బర్గర్లు, పిజ్జాలు తగ్గించి వేసి, ఆరోగ్యకరమైనకొవ్వులు, కూరగాయలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం అలాగే తక్కువ చక్కెర, తక్కువ ఆల్కహాల్ తీసుకోవడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని కొంతమేరకు తగ్గించవచ్చు అని వైద్యులు సూచిస్తున్నారు.

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది