Glaucoma : కంటి చూపుని తగ్గించే గ్లకోమా గురించి తెలుసా మీకు.? దీన్ని తెలుసుకోవడం కష్టం…!
Glaucoma : చాలా మందిలో ఎలక్ట్రానిక్ వస్తువులను ఎక్కువగా వాడడం వలన కంటి చూపు తగ్గిపోవడం మనం గమనిస్తూనే ఉన్నాం. అయితే చాలామంది నిద్రలో గురక పెట్టడం, పగటిపూట నిద్ర, అతిగా నిద్రపోవడం, తక్కువ నిద్రపోవటం ఇలాంటి వాటిలో అలవాటు ఏదైనా ఉంటే.. త్వరలో వారికి గ్లకోమా బారిన పడినట్లే.. ఓపెన్ యాక్సిస్ జనరల్ లో వెలువడిన యూకే బయో బ్యాంక్ అధ్యయనం. దీని విషయాన్ని బయట పెట్టింది గ్లకోమా మొదట లక్షణాలు సంకేతాలను కనుక్కోవడానికి చేసిన పరిశోధనలో ఈ విషయం వెలువడింది. దీర్ఘకాలిక నిద్ర రుగ్మతలతో ఇబ్బంది పడేవారు డేంజర్ లో పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.
గ్లకోమా ఎందుకు వస్తుందో తెలుసా.. అతి తక్కువ నిద్రించే వాళ్లు అంటే నిద్రలేమిటో ఇబ్బంది పడేవారిలో గ్లకోమా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఎక్కువగా నిద్రపోయే వాళ్లకి కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా పగటి నిద్ర గురక లాంటి అలవాట్లు ఉన్నవాళ్లకి గ్లకోమా వచ్చే అవకాశం ఉన్నట్లే యూకే భయ బ్యాంకులో 2006 నుండి పది మధ్యకాలంలో పాల్గొన్న 42 ,69 మధ్య వయసు ఉన్న సుమారు 4,09,053 ల మందిపై నిర్వహించిన పరీక్షలలో బయటికి వచ్చింది. రోజుకి 7 నుంచి 9:00 కన్నా తక్కువ నిద్రపోవడాన్ని నిద్రలేమి సమస్య అంటుంటారు. రాత్రులు సరియైన నిద్రపోని వాళ్ళు పగట నిద్రను ఆశ్రయిస్తూ ఉంటారు.
కంటి ఆరోగ్యం దృష్ట్యా ఇది చాలా ప్రమాదకరమని నిద్రలేమిటో 12%, గురకతో నాలుగు శాతం, పగటి పూట నిద్రతో 20 శాతం గ్లకోమా వచ్చే అవకాశం ఉంది. కావున నిద్ర విధానాన్ని బట్టి ఇది ప్రభావితం అవుతుంది. గ్లకోమా ప్రమాదం వీళ్ళకి ఎక్కువ.. గ్లకోమాతో ఇబ్బంది పడేవారిలో పురుషులు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు పరిశోధనలో తెలిసింది. ధూమపానం చేసేవాళ్లు అధిక రక్తపోటు మధుమేహం సమస్యలున్న మగవాళ్ళు ఈ వ్యాధిన పడే అవకాశం ఉంటుంది. గ్లకోమా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించేది కంటి అంతర్గత ఒత్తిడి ఒత్తిడి ఎంత ఉంటే అవయవాలు అంతగా పాడైపోతుంటాయి. గ్లకోమా అంటే… కంటి సంబంధిత వ్యాధులలో డేంజర్ అయినది గ్లూకోమా దీని లక్షణాలు బయటికి కనపడవు ఇది బాగా ముదిరిపోయిన తర్వాతే బయటికి వస్తుంది.
అప్పటికీ చూపు చాలా తగ్గిపోతూ ఉంటుంది. నిశ్శబ్దంగా కంటిచూపును కబళించి శాశ్వత అందత్వాన్ని తెచ్చే గ్లకోమాపై అవగాహన చాలా ముఖ్యం. 240 నాటికి ప్రపంచవ్యాప్తంగా 112 మిలియన్ల మంది అందత్వానికి కారణమయ్యే గ్లకోమా బారిన పడే ఛాన్స్ ఉందని వైద్యు నిపుణులు చెప్తున్నారు. కంటిలోని ఆతి సున్నితమైన కాంతి కణాల క్షీణత ఆఫ్టిక్ నరాలు దెబ్బతినడం వలన గ్లకోమా వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు తేల్చేశారు. అయితే గ్లకోమా వ్యాధి లక్షణాలు కారకాలు ఇప్పటికీ పూర్తిగా నిర్ధారణ కాలేదు అయితే ఈ వ్యాధికి సకాలంలో ట్రీట్మెంట్ తీసుకోకపోతే పూర్తిగా అందత్వానికి గురవుతారు.