Lotta Peesu Plant : లొట్ట పీసు మొక్క గురించి మీకు తెలుసా…! దీని లాభాలు తెలిసే వదిలిపెట్టరు..!
ప్రధానాంశాలు:
Lotta Peesu Plant : లొట్ట పీసు మొక్క గురించి మీకు తెలుసా...! దీని లాభాలు తెలిసే వదిలిపెట్టరు..!
Lotta Peesu Plant : లొట్ట పీసు అని కొట్టు పారేయకండి ఇందులో అనేక ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. దీనివల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక లొట్ట పీసు మొక్కలు ఉండేటు వంటి పాలు తేలు విషయానికి విరుడు గా పనిచేస్తాయి. అంతేకాకుండా చర్మం మీద వచ్చే తామర మరియు ఇతర చర్మవ్యాధులు వచ్చినప్పుడు లొట్ట పీసు ముక్కలు ఉండే పాలను రాస్తే తగ్గిపోతుంది.
అదేవిధంగా మనుషులను కుట్టే దోమలు మరియు పంట దిగుబడిని దెబ్బ తీసేటువంటి దోమలను నివారించడానికి ఈ మొక్కల ఆకుల నుంచి వచ్చే పొగ ఉపయోగపడుతుంది. అలాగే లొట్ట పీసు ముక్కను కాగితం తయారీలో కూడా వినియోగిస్తారు. పాదాల వాపుల వంటి సమస్యలు ఉంటే లొట్ట పీసు ఆకు తో తగ్గించవచ్చు. అంతేకాకుండా లొట్ట పీసు చెట్టు ఆకులను శుభ్రంగా కడిగి వాటిని మెత్తగా నూరుకోవాలి. దీనిని ఆవనూనెలో కలిపి వేడి చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పేస్టును పాదాల వాపు ఉన్నవారు దీనిని రాసుకొని మర్దన చేయాలి. ఇలా చేయడం వలన పాదాల వాపు పూర్తిగా తగ్గుతాయి.
పెద్ద వాళ్లకు వయసు మీద పడే కొద్ది కీళ్ల నొప్పులు వస్తాయి. ఇలా బాధపడుతున్న వారు ఆకుల పేస్టును రాసి కట్టుగా కట్టుకోవాలి. ఇలా చేయడం వలన కీళ్ల నొప్పులు తగ్గుముఖం పడతాయి. అయితే దీనిని ఉపయోగిస్తున్న సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య వైద్యులు చెబుతున్నారు. అలాగే దీనిని నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే ఉపయోగించాలి. అంతేకాకుండా లొట్ట పీస్ చెట్ల ఆకులను నీడలో ఎండబెట్టి దానిని పొడిగా చేసి గో మూత్రంలో కలపాలి. దీనిని సేంద్రియ ఎరువుగా కూడా ఉపయోగించవచ్చు. ఇక పల్లెటూరులో లొట్ట పీసు కట్టెలను ఇళ్లకు దండిగా మరియు పశువుల కట్టలకు రక్షణ గోడగా కట్టుకునేవారు. ఈ విధంగా లొట్ట పీసు చెట్లను అనేక రకాలుగా ఉపయోగిస్తారు. అలాగే అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి.