Health Benefits : కాకరకాయ తినడానికే చేదు.. కానీ ఫలితాలన్నీ తీపే..
Health Benefits : కాకరకాయ పేరు వినగానే చాలా మంది వామ్మో అనేస్తారు. ఈ రోజు కాకరకాయ కూర అనగానే.. ఆకలి లేదంటూ బుకాయిస్తారు. కాకరకాయ తినడానికి చాలా మంది అస్సలే ఇష్టపడరు. చాలా చేదుగా ఉంటుందని దాని జోలికి కూడా పోరు.కానీ కాకరకాయ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజానాలు అన్నీ ఇన్నీ కావు ఆ ఉపయోగాలు ఏంటో తెలుసుకుంటే కాకరకాయ ఇష్టం లేక పోయినా.. దానిని తినడానికి ప్రయత్నిస్తారు. కనీసం కొద్దీ మొత్తంలో అయినా రోజూ ఆహారంలో భాగం చేసుకుంటారు. కాకరకాయలో ఎన్నో పోషకాలు ఉంటాయి మరి. కాకరకాయ ఫ్రై చేసినా.. ఉడికించినా.. జ్యూస్ రూపంలో తీసుకున్నా.. అందులోని పోషకాలు శరీరానికి చాలా ప్రయోజనం చేకూరుస్తాయి.
ముఖ్యంగా వాన కాలంలో అయితే కాకరకాయను తరచూ తీసుకుంటే మరిన్ని ఎక్కువ ఉపయోగాలు ఉంటాయని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. కాకర శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థను పెంపొందిస్తుంది. బరువు తగ్గడానికి సహకరిస్తుంది.వాన కాలంలో కాకరకాయను ఎక్కువగా తీసుకోవడం వల్ల వాటిలోని యాంటీ ఆక్సిడెంట్లు రోగాలను రాకుండా అడ్డుకుంటాయి. కాకరతో ఒంట్లోని రోగ నిరోధక వ్యవస్థ బలంగా మారుతుంది. ఎలాంటి ఇన్ఫెక్షన్లు రావు. జలుబు, దగ్గు, జ్వరం లాంటి రోగాలు అస్సలే దరిచేరలేవు. కరోనా లాంటి మహమ్మారి వైరస్ లు సోకినా.. మన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ ఆ వైరస్ ను అడ్డుకుని బాడీకి ఎలాంటి నష్టం కలగకుండా అడ్డుకుంటుంది.
కరోనా సంక్షోభంలో చాలా మంది రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉన్న వాళ్లు చాలా ఈజీగానే బయట పడ్డారు. కాకరలోని యాండీ ఆక్సిడెంట్లు శరీరం నుంచి ట్యాక్సిన్లు బయటకు పోయేలా చేస్తాయి ఫలితంగా జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పని చేసి బరువు తగ్గుతారు. కాకరకాయలో క్యాలరీలు, కొవ్వు, కార్పొహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి.మధుమేహం వ్యాధిగ్రస్తులకు కాకర ఓ వరం అనే చెప్పుకోవాలి. కాకరకాయలోని ఆల్కలైడ్లు రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. ఇందులోని చార్న్ టిన్ పెప్ టైడ్లు ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి. కాకరకాయలోని యాంట్రీ మైక్రోబియాల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు రక్తాన్ని శుద్ధి చేయడంలో ఎంతగానో తోడ్పాటును అందిస్తాయి.