Green Tea : గ్రీన్ టీని వేసవి కాలంలో తాగితే ఎన్ని లాభాలో తెలుసా.. తెలిస్తే తాగకుండా వదలరు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Green Tea : గ్రీన్ టీని వేసవి కాలంలో తాగితే ఎన్ని లాభాలో తెలుసా.. తెలిస్తే తాగకుండా వదలరు..!

 Authored By ramu | The Telugu News | Updated on :10 May 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Green Tea : గ్రీన్ టీని వేసవి కాలంలో తాగితే ఎన్ని లాభాలో తెలుసా.. తెలిస్తే తాగకుండా వదలరు..!

Green Tea : ఉదయాన్నే టీ తాగకుంటే ఆ రోజు మనకు మొదలు కాదు కదా. మరీ ముఖ్యంగా మన ఇండియాలో చాయ్ ఎక్కువగా తాగుతుంటారు. ఇక టీ అలవాటు లేని వారు కొందరు పాలు, డికాక్షన్, లెమన్ టీ తాగుతుంటారు. ఇంకొందరు అయితే గ్రీన్ తాగుతుంటారు. అయితే గ్రీన్ టీ తాగేవారి సంఖ్య చాలాతక్కువ. కానీ గ్రీన్ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు అంతా ఇంతా కాదు. కానీ ఎక్కువ సార్లు కంటిన్యూగా గ్రీన్ టీ తాగితే మోషన్స్ అవుతాయని కొందరు భావిస్తుంటారు. కానీ అందులో నిజం లేదు. ఇంకొందరు అయితే గ్రీన్ టీని వేసవి కాలంలో తాగితే అనారోగ్య సమస్యలు వస్తాయని అనుకుంటారు.కానీ అందులో నిజం లేదని డాక్టర్లు చెబుతున్నారు. గ్రీన్ టీని ఏ కాలంలో అయినా తాగొచ్చని.. దాని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. గ్రీన్ టీ తాగడం ద్వారా కడుపు ఎప్పటి కప్పుడు శుభ్రంగా మారడం వల్ల, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అయితే గ్రీన్ టీని తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Green Tea : జీర్ణక్రియ ఆరోగ్యం కోసం..

ఎండాకాలంలో జీర్ణక్రియ సమస్యలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. ఇలాంటి సమయంలో గ్రీన్ టీని గనక తాగితే ఆరోగ్యంగా ఉండొచ్చు. ఈ గ్రీన్ బాడీ నుంచి వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది. కాబట్టి వేసవి కాలంలో కూడా రోజుకు రెండు సార్లు గ్రీన్ తాగితే నష్టమేం ఉండదు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత ఒక కప్పు గ్రీన్ తాగొచ్చు. ఇక రెండో కప్పును సాయంత్ర సమయంలో తాగితే సరిపోతుందని డాక్టర్లు చెబుతున్నారు. యాసిడిటీ సమస్యలను తొలగిస్తుంది.

Green Tea గ్రీన్ టీని వేసవి కాలంలో తాగితే ఎన్ని లాభాలో తెలుసా తెలిస్తే తాగకుండా వదలరు

Green Tea : గ్రీన్ టీని వేసవి కాలంలో తాగితే ఎన్ని లాభాలో తెలుసా.. తెలిస్తే తాగకుండా వదలరు..!

Green Tea గ్రీన్ టీ ప్రయోజనాలు..

గ్రీన్ టీ తాగితే అన్నింటికన్నా ఎక్కువగా కలిగే ప్రయోజనం ఏంటంటే బరువు తగ్గడం. పొట్టలోని కొవ్వును మొత్తం గ్రీన్ కరిగిస్తుంది. ఎందుకంటే ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది. మన కడుపు క్లీన్ గా ఉంటేనే ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. కానీ కడుపు క్లీన్ గా ఉండకుంటే మాత్రం కచ్చితంగా సమస్యలు వస్తాయి. అలాంటప్పుడు గ్రీన్ టీ తాగితే కచ్చితంగా కడుపు క్లీన్ గా ఉంటుంది. దాని వల్ల మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. గ్రీన్ టీని తాగడం వల్ల వేడి నుంచి ఉపశమనం పొందవచ్చు. అంతే కాకుండా డీహైడ్రేషన్ కాకుండా కాపాడుకోవచ్చు. గ్రీన్ టీ తాగడం వల్ల బాడీ ఉష్ణోగ్రతలు సమతుల్యం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది