Health Benefits : పెరుగుని చలికాలంలో తీసుకోవడం వలన కలిగే ఉపయోగాలు తెలుసా..? తెలిస్తే తినడం మానరు…!
Health Benefits : పెరుగు అంటే అందరూ ఇష్టంగానే తింటూ ఉంటారు. అయితే ఈ చలికాలంలో పెరుగుని తక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే పెరుగు వలన జలుబు లాంటి సమస్యలు వస్తాయని కొంతమంది అపోహ కారణంగా మానేస్తూ ఉంటారు. అయితే ఈ చలికాలంలో పెరుగుని తినడం వలన కూడా ఎన్నో ప్రయోజనాలు పొందడమే కాక ఈ కాలంలో కలిగే అనేక సమస్యలు కూడా తగ్గిపోతాయి. అయితే పెరుగు కూలింగ్ ప్రభావం బాగా ఉంటుంది. చలికాలంలో ఎక్కువగా ఆరోగ్యం పై శ్రద్ధ మరింత తీసుకోవాల్సి అవసరం వచ్చినట్లే.. లేకపోతే అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. చలికాలంలో తమ ఆరోగ్యం కోసం చాలామంది తాము తీసుకునే ఆహారం పానీయాలలో ఎన్నో జాగ్రత్తలు వహిస్తూ ఉంటారు. ఇది ఆరోగ్యానికి మంచిది.
ఈ చలికాలంలో పెరుగుని తీసుకోవడం వలన కూడా ఎన్నో ఉపయోగాలు పొందడమే కాకుండా ఈ కాలంలో కలిగే ఎన్నో సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. చలికాలంలో పెరుగు తీసుకోకూడదని చాలామంది. చెప్పడం మనం వింటూనే ఉంటాం. చలికాలంలో పెరుగును తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని కూడా చెప్తూ ఉంటారు. అయితే ఆరోగ్య నిపుణులు మాత్రం దీనికి భిన్నంగా చెబుతున్నారు. చలికాలంలో పెరుగు తీసుకోవడం వలన మీ రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వారు నమ్ముతుంటారు. పెరుగులోని ఎన్నో పోషకాలు మీ శరీరానికి చలిని తట్టుకునే సామర్థ్యాన్ని కూడా కల్పిస్తూ ఉంటాయి. అలాగే ఆహారం తొందరగా జీర్ణం అవ్వడానికి కూడా ఉపయోగపడుతుందని వారు చెప్తున్నారు. చలికాలంలో పెరుగు తీసుకోవడం వల్ల కలిగే ఉపయోగాలు గురించి మనం ఇప్పుడు చూద్దాం…!
మెరిసే చర్మం : మీ ఆహారంలో పెరుగుని చేర్చుకోవడం వలన మీ చర్మం మెరుస్తూ ఉంటుంది. పెరుగులో ఉన్న మార్చ్ రైజింగ్ లక్షణాలు ముఖాన్ని కాంతివంతంగా ఉంచడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే బ్లాక్ హెడ్స్ ని తగ్గించడంలో కూడా పెరుగు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది మీ చర్మం మచ్చలేనిదిగా మార్చడమే కాక దానిని మెరిసేలా చేస్తూ ఉంటుంది.
ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతుంది : శీతాకాలంలో చర్మం తరచుగా పొడిబారటం వలన ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ పరిస్థితిని తగ్గించేందుకు మీరు పెరుగు తీసుకోవచ్చు. దీనిలో విటమిన్ సి పొటాషియం మెగ్నీషియం ప్రోటీన్ లాంటి అనేక పోషకాలు కలిగి ఉంటుంది. ఇది శీతాకాలంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలను తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది.
దృఢమైన ఎముకలు : చలికాలంలో ప్రజలకు ఎదురయ్యే సమస్యలతో ఎముకల నొప్పి ఉంటుంది చలికాలం కారణంగా ఎముకలు ఎన్ను నొప్పి చాలా అధికంగానే ఉంటుంది. ఆ పరిస్థితిని తగ్గించుకోవడానికి పెరుగు ని తీసుకోవచ్చు. దీనిలో ఉండే కాల్షియం ఎముకలని గట్టిపరుస్తుంది. ఇంకా ఎముకల నొప్పులు కూడా తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. పెరుగుని తీసుకోవడం వల్ల ఎముకల నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
ఆరోగ్యకరమైన జీర్ణ క్రియ : చాలామందికి ఉండే కొన్ని చెడు ఆహారపు అలవాట్లు వల్ల వాళ్లకి జీర్ణ సమస్యలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా శీతాకాలంలో ఆహారపు అలవాట్ల ఎఫెక్ట్ ఎక్కువగా పడుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో శరీరం యొక్క పీహెచ్ లెవెల్స్ ని కూడా అధికమవుతూ ఉంటాయి. ఇంకా దీని ఎఫెక్ట్ మానవజీ అన్నయ వ్యవస్థ మీద కూడా పడుతుంది. మీరు మీ జీర్ణ శక్తిని క్రమబద్ధీకరించాలనుకుంటే మీరు పెరుగు తీసుకోవాలి. ఈ సీజన్లో పెరుగు అధికంగా తీసుకోవడం వలన మీ జీర్ణక్రియ సమస్యలు తగ్గిపోతాయి..