Coriander : కొత్తిమీరతో కోటి లాభాలు.. ఖాళీ కడుపుతో తాగితే జరుగుతుందో తెలుసా…!
ప్రధానాంశాలు:
Coriander : కొత్తిమీరతో కోటి లాభాలు.. ఖాళీ కడుపుతో తాగితే జరుగుతుందో తెలుసా...!
Coriander : మనం కొత్తిమీరను ప్రతిరోజు ఏదో ఒక వంటకాలలో ఉపయోగిస్తూ ఉంటాం. అయితే కొంతమంది మాత్రం దానిని తినేందుకు ఇష్టపడరు. ఇలా కొత్తిమీరను తినకపోవడం వలన అనేక లాభాలను కోల్పోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కొత్తిమీర ఆకులను తినలేను అనుకునేవారు వాటిని జ్యూస్ లా చేసుకొని రోజు ఉదయం పరిగడుపున తాగవచ్చు. అయితే ఈ జ్యూస్ ని కేవలం ఒక గ్లాస్ మోతాదులో మాత్రమే తాగాలి. కొత్తిమీరను వంటకాలలోనే కాకుండా కూడా జ్యూస్ లలో ఉపయోగిస్తారు. ఈ క్రమంలోనే ఉదయం పూట పరిగడుపున కొత్తిమీర జ్యూస్ తాగడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
![Coriander కొత్తిమీరతో కోటి లాభాలు ఖాళీ కడుపుతో తాగితే జరుగుతుందో తెలుసా](https://thetelugunews.com/wp-content/uploads/2025/02/Coriander.jpg)
Coriander : కొత్తిమీరతో కోటి లాభాలు.. ఖాళీ కడుపుతో తాగితే జరుగుతుందో తెలుసా…!
ఎందుకంటే కొత్తిమీర లో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు, మెగ్నీషియం, విటమిన్లు, ఫైబర్, ఐరన్ , క్యాల్షియం, పొటాషియం పుష్కలంగా లభిస్తాయి. తరచూ ఖాళీ కడుపుతో కొత్తిమీర జ్యూస్ తాగడం వలన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తొలగిస్తుంది. అంతేకాకుండా ఫైబర్ అధికంగా ఉండే కొత్తిమీర జీర్ణ క్రియ మెరుగుపరుస్తుంది. ఉబ్బరం గ్యాస్ వంటి ఆరోగ్య సమస్యలను నుండి కూడా ఉపశమనం పొందవచ్చు. మన శరీరానికి కావాల్సిన రోగ నిరోధక శక్తిని పెంచడానికి కొత్తిమీర లో ఉండే విటమిన్ సి, ఏ మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉపయోగపడతాయి.
కళ్ళ ఆరోగ్యానికి కొత్తిమీర లో ఉండేటువంటి విటమిన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో కొత్తిమీర రసం తాగడం వలన ఎముకల ఆరోగ్యం బాగుంటుంది. ఇక ఇందులో ఉండే క్యాల్షియం మరియు మెగ్నీషియం ఎముకలకు కావాల్సిన పోషణను అందిస్తాయి. పరిగడుపున కొత్తిమీర జ్యూస్ తాగడం వలన రక్తంలో గ్లూకోజ్ స్థాయి నియంత్రణలో ఉంటుంది. దీంతో ఇన్సులిన్ స్థాయిలను నియంత్రణలో ఉంటాయి.
అదేవిధంగా కొత్తిమీర జ్యూస్ చెడు కొలెస్ట్రాలను తగ్గించి మంచి కొలెస్ట్రాలను పెంచుతుంది. ఇది విటమిన్ల మరియు పోషకాలతో నిండి ఉండడం వలన ఇది చర్మ ఆరోగ్యానికి కూడా మంచిది. కొత్తిమీర ఆకులలో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు ప్రీ రెడికల్స్ కు వ్యతిరేకంగా పోరాడి కణాలను రక్షిస్తాయి. తరిగడుపున కొత్తిమీర జ్యూస్ తాగడం వలన గుండె ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇది బీపీ నియంత్రణలో ఉంచుతుంది. ఒకవేళ ఉదయం పరిగడుపున కొత్తిమీర జ్యూస్ ని తాగలేని వారు భోజనానికి 45 నిమిషాల ముందు లేదా భోజనం తిన్న తర్వాత 45 నిమిషాల తర్వాత దీనిని తాగవచ్చు.