Fits : ఫిట్స్ వస్తున్నప్పుడు ఇనుము చేతిలో ఎందుకు పెడతారో తెలుసా మీకు..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Fits : ఫిట్స్ వస్తున్నప్పుడు ఇనుము చేతిలో ఎందుకు పెడతారో తెలుసా మీకు..?

 Authored By prabhas | The Telugu News | Updated on :16 November 2022,6:30 am

Fits : చాలామంది మూర్చ వ్యాధితో బాధపడటం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఆ మూర్చ వచ్చినప్పుడు వాళ్ళ చేతులలో ఇనప రాడ్లు కానివ్వండి. లేదా తాళాలు గుత్తి కానివ్వండి ఇలా పెడుతూ ఉంటారు. అయితే అలా ఎందుకు పెడతారో ఇప్పుడు మనం చూద్దాం… నాడి వ్యవస్థ పైన ప్రభావం పడే వ్యాధి మూర్ఛ వ్యాధి. ఇది ఎలాంటి వారికైనా వస్తుంది. ప్రతి ఏడాది దాదాపు 1,80,000 మంది కొత్త మూర్చ వ్యాధి కేసులు రాష్ట్రవ్యాప్తంగా నమోదు అవుతున్నవి.. అయితే ఫిట్స్ వచ్చే ముందు ఎటువంటి లక్షణాలు కనబడవు కావున మనిషి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫిట్స్ వచ్చిన వెంటనే ఎవరైనా తాళాల కోసం వెతుకుతూ ఉంటారు.

ఎందుకనగా ఫిట్స్ ని కంట్రోల్ లో ఉంచగలిగే శక్తి ఇనప వస్తువులకి మాత్రమే ఉందని అందరూ నమ్ముతుంటారు. అయితే ఇందులో ఎటువంటి వాస్తవం లేదంటున్నారు న్యూరో సర్జన్ నిపుణులు. ఇంకా వాస్తవం తెలియజేయాలంటే ఎవరికి ఫీట్స్ వచ్చిన అది రెండు నిమిషాల నుంచి ఐదు నిమిషాల వరకే ఉంటుందట. ఆ సమయంలో టెన్షన్ పడితే ఎక్కడో చోట తాళాలు గానీ ఇనుప వస్తువు చేతిలో పెట్టడం జరుగుతుంది. ఐదు నిమిషాల సమయంలో చేతులు కాళ్లు ఆడించడం ఆగిపోతుంది. దాంతో తాళాలు బాగా పనిచేశాయి అనుకుంటూ ఉంటారు. అయితే ఈ ఇనప రాడ్లు, తాళాలు పెట్టిన పెట్టకపోయినా రిజల్ట్ అనేది ఒకటే లాగా కనిపిస్తూ ఉంటుంది.

Do you know why iron is placed in hand when fits are coming

Do you know why iron is placed in hand when fits are coming

ఫిట్స్ వ్యాధిని ఆపలేదు కావున ఆ టైంలో ఏం చేయాలంటే ఫిట్స్ వచ్చిన మనిషిని నేలపై పడుకోబెట్టాలి. మూర్చతో కొట్టుకుంటూ చేతులు కాళ్లు అటు ఇటు ఏగంగా కదిలించిన అదేవిధంగా వదిలేయాలి. దానిని ఆపడానికి అస్సలు ట్రై చేయకూడదు. ఒకవేళ దానిని ఆపినట్లైతే వారికి ఒక్కసారిగా హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉంటుంది.అదేవిధంగా ఫిట్స్ వచ్చిన రోగి నోట్లో నురగ వస్తూ ఉంటుంది. దాన్ని ఆపడానికి నోట్లో ఎటువంటి దుస్తులను వస్తువులను ఉంచకూడదు. వాళ్లు వాంమ్తింగ్గ్ చేసుకుంటే వాళ్లని చేసుకోనివ్వాలి. ఈ ఫిట్స్ వచ్చిన మనిషికి గాలి తగిలేలా చూస్తూ ఉండాలి. తర్వాత వైద్య నిపుణుల దగ్గరికి తీసుకువెళ్లాలి.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది