Saunf And Ajwain Tea : జీలకర్ర వాముతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో .. మందుల అవసరమే ఉండదు..!!
Saunf And Ajwain Tea : మన పోపుల పెట్టెలో దాగి ఉండే జీలకర్ర, వాము వలన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో వీటికి చాలా ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా ఉదర సంబంధిత వ్యాధుల నివారణకు అద్భుతంగా పనిచేస్తాయి. ఉదయాన్నే పరిగడుపున జీలకర్ర, వాము నీటిలో మరిగించి హెర్బల్ టీ తయారీ చేసుకొని త్రాగితే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. మన శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్ లను తొలగించడంతో పాటు శరీరాన్ని డిటాక్సీ ఫై చేయడంలో బాగా పని చేస్తాయి. ఆయుర్వేదంలో జీలకర్ర, వామును ఔషధంగా పరిగణిస్తారు. వాము ఉదర సంబంధిత వ్యాధులకు బాగా పని చేస్తుంది.
ఇక జీలకర్ర సర్వరోగ నివారిణి. జీలకర్రలో ఉండే ఔషధ గుణాలు శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి కాపాడడంలో సహాయపడతాయి. జీలకర్ర, వాము చర్మానికి చాలా మేలు చేస్తాయి. జీలకర్ర వాము హెర్బల్ టీ త్రాగడం వలన చర్మం మెరుస్తుంది. జీలకర్ర, వాము నీళ్లు మన చర్మాన్ని నిర్విషీకరణ చేస్తోంది. మొటిమలు, మచ్చలు లేకుండా చేస్తుంది. జలుబు, ఫ్లూ వంటి జ్వరాలను తగ్గిస్తాయి. జీలకర్ర, వాము నీటిని త్రాగడం వలన గొంతు నొప్పి, దగ్గు వంటి సమస్యలు తొలగిపోతాయి. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడం చాలా ప్రభావంతంగా పనిచేస్తుంది. ఈ నీటిలో చాలా తక్కువ మొత్తంలో క్యాలరీలు ఉంటాయి.
జీలకర్ర, వాము నీళ్లను త్రాగడం వలన అధిక బరువును తగ్గించుకోవచ్చు. అలాగే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుగా ఉంటుంది. దీంతోపాటు గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు కూడా దూరమవుతాయి. వాంతులు, వికారం, మార్నింగ్ సిక్ నెస్ వంటి సమస్యలు జీలకర్రృ వాము నీళ్లు తాగడం వలన దూరం అవుతాయి. జీలకర్ర వాము పొడిని తయారు చేసి ప్రతిరోజు ఉదయాన్నే పరిగడుపున వేడి నీటిలో కాసేపు మరిగించి ఆ నీటిని త్రాగాలి. అయితే గర్భిణీ స్త్రీలు మాత్రం జీలకర్ర, వాము నీటిని త్రాగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ సలహా మేరకు ఈ హెర్బల్ టీనీ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే చిన్న పిల్లలు ఈ టీ త్రాగకపోవడమే మంచిది. అలాగే పేగుపూతతో బాధపడే వారు ఈ హెర్బల్ టీనీ తీసుకోకపోవడమే మంచిది.