Fenugreek : ఖాళీ కడుపుతో మెంతుల నీళ్లు తాగితే ఆ సమస్యలన్నీ ఇట్టే మాయం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Fenugreek : ఖాళీ కడుపుతో మెంతుల నీళ్లు తాగితే ఆ సమస్యలన్నీ ఇట్టే మాయం…!

 Authored By ramu | The Telugu News | Updated on :7 June 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Fenugreek : ఖాళీ కడుపుతో మెంతుల నీళ్లు తాగితే ఆ సమస్యలన్నీ ఇట్టే మాయం...!

Fenugreek : మెంతులు అనేవి ప్రతి ఒక్కరి వంట గదిలో ఉంటాయి. అయితే ఈ మెంతులలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. నిజానికి మెంతులను వంటకే కాదు, ఔషధంగా కూడా ప్రాచీన కాలం నుండి వాడుతున్నారు. మెంతులు చేదుగా ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. మెంతులు ఇతర రకాల పోషకాలు కలిగి ఉంటాయి. మెంతులను నీటిలో నానబెట్టుకొని తీసుకోవటం వలన ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. కావున ప్రజలు ఏ సమస్యలు ఉన్నప్పుడు తాగాలి. ఎప్పుడూ తాగాలి. అనే వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మెంతులను నానబెట్టి ఆ నీటిని ఉదయాన్నే తాగటం వలన ఎన్నో రకాల అనారోగ్యాలు నయం అవుతాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది అజీర్ణం, ఉబ్బరం,మలబద్ధకం లాంటి జీర్ణ సమస్యలను కూడా తగ్గించగలదు. ఇంకా మెంతి నీరు ఆకలిని తగ్గిస్తుంది. జీవక్రియను కూడా ఎంతో పెంచగలదు. కొవ్వు నిల్వను కూడా తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. మొత్తం గుండె ఆరోగ్యాన్ని కూడా ఎంతో మేలు చేస్తుంది. అయితే ఉదయాన్నే తాగితే చాలా మంచిది అని వైద్య నిపుణులు తెలిపారు. ఖాళీ కడుపుతో మెంతుల నీరు తీసుకోవటం వలన రక్తంలో చక్కెర స్థాయిలను కూడా తగ్గించవచ్చు. ఇంకా బరువు తగ్గటం లో కూడా ఎంతో మేలు చేస్తుంది. తాగిన తర్వాత కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది.

Fenugreek ఖాళీ కడుపుతో మెంతుల నీళ్లు తాగితే ఆ సమస్యలన్నీ ఇట్టే మాయం

Fenugreek : ఖాళీ కడుపుతో మెంతుల నీళ్లు తాగితే ఆ సమస్యలన్నీ ఇట్టే మాయం…!

కావున ఎక్కువ ఆహారం తీసుకోలేరు. అలాగే అధిక క్యాలరీలు తీసుకోవటం తగ్గించడం ద్వారా బరువు కూడా తగ్గటంలో సహాయం చేస్తుంది. మెంతి నీరు వీటన్నిటితో పాటు రోగనిరోధక శక్తిని కూడా బలంగా చేస్తుంది. వాపును కూడా తగ్గిస్తుంది. ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కూడా శరీరాన్ని ఎంతో రక్షిస్తుంది. ఇది పీరియడ్స్ నొప్పిని కూడా తగ్గించగలదు. ఇంకా రుతు,తిమ్మిరి,ఉబ్బరం లాంటి లక్షణాలను తగ్గించడంలో కూడా ఎంతో ప్రయోజనకరమైన లక్షణాలను కలిగి ఉన్నది. అంతే మెంతులను నానబెట్టి తలకు పట్టించటం వలన కూడా జుట్టు ఆరోగ్యానికి మంచిదని నిపుణులు తెలిపారు. ఇలా చేయటం వలన చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది