Belly Fat : రోజు ఈ డ్రింక్ తాగితే బెల్లీ ఫ్యాట్ తగ్గటమే కాదు ఇంకా ఎన్నో ప్రయోజనాలు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Belly Fat : రోజు ఈ డ్రింక్ తాగితే బెల్లీ ఫ్యాట్ తగ్గటమే కాదు ఇంకా ఎన్నో ప్రయోజనాలు..!

 Authored By aruna | The Telugu News | Updated on :31 October 2023,10:00 am

ప్రధానాంశాలు:

  •  రోజు ఈ డ్రింక్ తాగితే బెల్లీ ఫ్యాట్ తగ్గటమే కాదు ఇంకా ఎన్నో ప్రయోజనాలు

  •  అధిక బరువు బెల్లీ ఫ్యాట్ తో బాధపడుతున్న వారికి ఈ సోయ ఎంతో ఉపయోగపడుతుంది

Belly Fat : ఆవు పాలని మించిన సోయా పాల ఉపయోగాలు సోయాబీన్స్ వీటి గురించి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వీటి వాడకం కూడా తక్కువగానే ఉంటుంది. కాబట్టి కానీ ఈ మధ్యకాలంలో వీటి ప్రాముఖ్యత తెలియడంతో వీటికి ఆధారం బాగా పెరిగింది. అధిక బరువు బెల్లీ ఫ్యాట్ తో బాధపడుతున్న వారికి ఈ సోయ ఎంతో ఉపయోగపడుతుంది. బరువు తగ్గాలన్న.. ఎముకలు బలంగా ఉండాలన్న ఈస్ట్రోజన్ సమస్యను అధికమించాలన్న సోయా పాలు మేలు అని అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఈ పాలల్లో మాంసకృతులు పీచు, విటమిన్లు కనిజాలు, పుష్కలంగా ఉంటాయి.

ఇవి శరీరానికి శక్తిని అందివ్వడమే కాదు చురుగ్గా పనిచేసేందుకు తోడ్పడతాయి. దీనివల్ల ఆరోగ్యమే కాదు అందం కూడా మీ సొంతమవుతుంది. ఈ పాలను రోజు తీసుకోవడం వలన మీ శరీరంలో ఉన్న చెడు కొవ్వును కరిగిస్తుంది. కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉన్న ఫ్యాటీ ఆసిడ్స్ రక్తనాళాల ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఫ్రీ రాడికల్స్ వలన కలిగే హానిని నియంత్రిస్తాయి. సోయా పాలలో సహజంగానే చక్కెర తక్కువగా ఉంటుంది. కాబట్టి బరువు తగ్గడం సులభం అవుతుంది. రోజు ఈ పాలను తీసుకోవడం వలన శరీరానికి పీచు అందుతుంది. కాబట్టి ఆకలి కూడా ఉండదు. మోనో పాజ్ దశకు చేరుకునే మహిళల్లో ఈస్ట్రోజన్ హార్మోను తగ్గిపోతుంటుంది. మధుమేహం అధిక బరువు లాంటి సమస్యలు మహిళలకు ఎదురవుతూ ఉంటాయి.

అలాంటి వారికి ఈ పాలు చాలా బాగా ఉపయోగపడతాయి. సోయాలోని ఈస్ట్రోజన్ సమస్యలను నిరోధిస్తుంది. చాలామంది మహిళల్లో కనిపించే మరో సమస్య ఆస్టియో పోరాసిస్ ఆ సమస్య తీవ్రతలు ఎక్కువగా ఉన్నవారికి ఈ పాలు చాలా బాగా ఉపయోగపడతాయి…

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది