Weight loss : మీకు తెలుసా…. జామ ఆకులతో సులువుగా బరువు తగ్గవచ్చు….
Weight loss : జామపండుని ఇష్టపడని వారు వుండరు.రోజుకోక జామపండుని తింటే ఎటువంటి జీర్ణక్రియ సమస్యలు రావు. జామపండులో చాలా ఔషధ గుణాలు వుంటాయి.ఇది మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.అయితే తాజా అధ్యయనాల ప్రకారం జామ ఆకులో కూడా మంచి ఔషధ గుణాలు వున్నాయని వెల్లడించారు.జామ ఆకులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయట.జామ ఆకులను తినడం వలన మనకు ఎటువంటి లాభమో చర్చించుకుందాం.

Easily loss the weight our body with Guava leaves
జామ ఆకుల్లో మంచి ఔషధ గుణాలున్నాయి.ఈ ఆకుల్లో ముఖ్యంగా ఐదు రకాల ఉపయోగాలున్నాయి.
1)ఈ ఆకులు శరీరంలోని కార్బోహైడ్రేట్లను తగ్గిస్తుంది.సులువుగా మన బాడీ బరువు తగ్గేలా చేస్తుంది.
2)జామఆకుల నుంచి తయారైన టీ ఆల్ఫా గ్లూకోసిడోస్ ద్వారా షుగరు వ్యాధి రోగులలో రక్తంలో చక్కెర స్థాయి కంట్రోల్ లో వుంటుంది.
3)జామాకుల్లో వుండే యాంటీఆక్సీడెంట్లు జుట్టు ఎదుగుదలకు సహకరిస్తాయి.ఈ ఆకులను మెత్తగా నూరి తలకు పట్టిస్తే కురులు నల్లగా నిగనిగలాడతాయి.
4)జామ ఆకుల రసాన్ని రోజు తాగడం వలన మీ శరీరంలోని అధిక కొవ్వును కరిగిస్తుంది.కొద్ది రోజుల్లోనే ఈజీగా బరువు తగ్గుతారు.
5)జామ ఆకులను,కొద్దిగా బియ్యపు పిండిని నీటిలో వేసి మరిగించి ఆ నీటిని రోజు తాగడం వలన శరీర బరువును తగ్గించుకోవచ్చు. అందుకే జామపండ్లనే కాదు,జామ ఆకులను కూడా తినండి.జామ ఆకులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.అధిక బరువు వున్నవారు జామ ఆకుల రసాన్ని రోజు తాగడం వలన సులువుగా బరువు తగ్గుతారు.ఇంకా డయాబెటిస్ ను నియంత్రణలో వుంచుకోండి.