Millet Roti : గోధుమ చపాతీలతో అనారోగ్య సమస్యలు అధికం… తస్మాత్ జాగ్రత్త…!
Millet Roti : చాలామంది రాత్రి సమయంలో రొట్టెలను తింటారు. కొంతమంది భోజనం లో అన్నం తో పాటు రొట్టెలను తీసుకుంటారు. రొట్టెల అలవాటు చాలామందికి ఉంటుంది. సహజంగా రొట్టె అంటే గోధుమపిండితో తయారు చేసేది అనుకుంటారు. దీని వలన ఆరోగ్యానికి మేలు జరుగుతుందని అనుకుంటారు కానీ ఈ గోధుమ రొట్టె తినడం వలన కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందులో జీర్ణ సమస్య, చాతి గొంతు వంటి సమస్యలు ముఖ్యమని చెప్పాలి. ఇక ఈ గోధుమ పిండిలో అధిక ఫైబర్ ఉన్నందున దీనిని తీసుకొంటే జీర్ణ కావడం కష్టం అవుతుంది.అలాగే గోధుమలలో ఉండే గ్లూటైన్ కొంతమందికి సహకరించదు. దీనివలన జీర్ణ సమస్యలు మొదలవుతాయి. అయితే ప్రతిరోజు రొట్టెలు తినే అలవాటు ఉన్నవారు గోధుమపిండికి బదులుగా ఇతర పదార్థాలతో తయారు చేసిన రొట్టెలను తినవచ్చు. అలాగే ఆరోగ్యానికి మేలును కలిగించే రొట్టెలను తినడం వలన ఆరోగ్యం మరింత బాగుంటుంది. మరి రొట్టెలను ఏ పదార్థాలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిని చేకూరుస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
Millet Roti : తృణధాన్యాలు…
రొట్టెలు తినడం అలవాటు ఉన్నవారు గోధుమలకు బదులుగా తృణధాన్యాల తో చేసిన రొట్టెను తినడం మంచిది. అలాగే మిల్లెట్ ఓట్స్ మరియు బార్లీ పిండితో తయారుచేసిన రోటీలు తీసుకోవచ్చు.ఇలాంటి రోటీలు తినడం వలన బరువు అదుపులో ఉంటుంది. అలాగే పోషక లోపం ఉండదు.
Millet Roti శనగపిండి…
అలాగే గోధుమ పిండికి బదులుగా శనగపిండిని కూడా ఉపయోగించుకోవచ్చు.శనగపిండి వలన బరువు నియంత్రణలో ఉండడం తో పాటు ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
Millet Roti జొన్న పిండి….
అదేవిధంగా జొన్న పిండితో చేసిన రొట్టెలు కూడా తినవచ్చు. జొన్న పిండిలో ఐరన్ ప్రోటీన్లు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. దీనివలన సులభంగా జీర్ణం అవుతుంది.
అలాగే వాటితోపాటు మిల్లెట్స్ తో చేసిన రొట్టే తినడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఇందులో మెగ్నీషియం, ఐరన్, వివిధ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దీనివలన రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఇది తోడ్పడుతుంది. గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరుకు సమాచారం ఆధారంగా జరిగింది. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే..