Dry Fruit : డ్రై ఫ్రూట్స్ ఇలా తీసుకుంటున్నారా…తస్మాత్ జాగ్రత్త..!
ప్రధానాంశాలు:
Dry Fruit : డ్రై ఫ్రూట్స్ ఇలా తీసుకుంటున్నారా...తస్మాత్ జాగ్రత్త..!
Dry Fruit : ఆరోగ్యంగా ఉండాలని ఎవరు కోరుకోరు చెప్పండి. ఇక దీనికోసం చాలామంది జిమ్ కు వెళ్లి వర్క్ ఔట్స్ చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటుంటే మరికొందరు పండ్లు నట్స్ వంటి పోషకాహారాలు తీసుకుంటూ ఉంటారు. ఈ విధంగా తమను తాము ఆరోగ్యంగా ఉంచుకోవడానికి పలువురు పలు రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే మీరు కూడా ఫిట్ గా ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే ఈ వార్త మీ కోసమే. అయితే వాస్తవానికి మెరుగైన ఆరోగ్యం పొందాలంటే మార్కెట్ లో అనేక రకాల జ్యూస్ , పౌడర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక వీటిని తీసుకోవడం ద్వారా కూడా మీరు చాలా ఫ్రీగా ఉండవచ్చు. కానీ కొన్ని సందర్భాలలో వీటిని అధిక మోతాదులో వినియోగించడం హానికరం. అంతేకాక ప్రస్తుత కాలంలో ఎక్కడ చూసినా కల్తీ ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి బయట దొరికే ఇలాంటి కల్తీ అయినా ఆహారాలను తీసుకోవడం కంటే ఇంట్లోనే ఉంటూ డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఇక ఈ డ్రై ఫ్రూట్స్ లో వివిధ రకాల పోషకాలు పుష్కలంగాా లభిస్తాయి. అలాగే డ్రై ఫ్రూట్స్ వినియోగం మన శరీరానికి కూడా చాలా మేలును కలగజేస్తుంది. ఇక వీటిని ప్రతిరోజు తీసుకోవడం వలన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అయితే ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం ప్రతిరోజు గుప్పెడు డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వలన నీరసం , నిస్సత్తువ దరిచేరవు. శరీరానికి కావాల్సిన శక్తి పుష్కలంగా లభిస్తుంది. అయితే ఈ డ్రై ఫ్రూట్స్ ను తీసుకునేటప్పుడు కచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆ నియమాలను పాటించడం వలన మెరుగైన లాభాలను పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. సరైన సమయంలో తీసుకోవాలని సూచిస్తున్నారు. మరి ఆ విషయాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Dry Fruit : గుండె సమస్యలు దరిచేరవు
డ్రై ఫ్రూట్స్ లో విటమిన్లు , ప్రోటీన్లు , ఫైబర్ మినరల్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కావున డ్రై ఫ్రూట్స్ ను క్రమం తప్పకుండా ప్రతిరోజు తీసుకోవడం వలన శారీరక మరియు మానసిక ఆరోగ్యం బలపడుతుంది. ప్రతిరోజు కావాల్సినంత శక్తిని శరీరానికి అందిస్తుంది. అదేవిధంగా గుండె సంబంధిత సమస్యలను కూడా దూరం చేస్తాయి. వైద్య నిపుణులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఆరోగ్యకరమైన వ్యక్తులు ప్రతిరోజు 15 నుండి 25 గ్రాముల డ్రైఫ్రూట్స్ తినవచ్చు. కానీ ఖచ్చితంగా వయస్సు మరియు ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వీటిని తీసుకోవాలి. కాబట్టి ఏవైనా ఆరోగ్య సమస్యలు కలిగి ఉన్నవారు ముందుగా మీ డాక్టర్ ను సంప్రదించి సలహా తీసుకోవడం మంచిది .
Dry Fruit : ఎలా తీసుకోవాలంటే
అయితే ఈ డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం అనేది హానికరం అసలు కాదు కానీ సరైన సమయం ,అలాగే సరైన విధంగా తీసుకోవడం ఎంతో ముఖ్యం. అయితే ఈ డ్రై ఫ్రూట్స్ ను తీసుకునే ముందు వాటిని రాత్రంతా నీటిలో నానబెట్టుకోవాలి. ఇక ఉదయాన్నే పోట్టు మొత్తం తీసేసి తినాలి. దీనివలన పోషకాలు గ్రహించడం చాలా సులభం అవుతుంది. ఒకవేళ మీరు నానబెట్టడం మర్చిపోతే రోస్ట్ లాగా చేసుకొని తీసుకోవడం మంచిది. ఇక ఆరోగ్యకరమైన వ్యక్తి ప్రతిరోజు 15 నుండి 25 గ్రాములు డ్రై ఫ్రూట్స్ తినవచ్చట. అంతకంటే ఎక్కువ తీసుకుంటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో మరియు వైద్యనిపుణులు అందించిన సలహాల మేరకు రూపొందించడం జరిగింది. ది తెలుగు న్యూస్ దీనిని ధృవీకరించలేదు. దయచేసి గమనించగలరు.