OIls Costlier Price hike : పెరిగిన వంటనూనెల ధరలు.. ఫెస్టివల్ టైం ప్రజల కళ్లల్లో కన్నీళ్లు..!
OIls Costlier Price hike : నిత్యావసరాల ధరలు మండిపోతున్న ఈ టైం లో ఒకదానికి మరొకటి అన్నట్టుగా రేట్లు పెరుగుతూ వెళ్తున్నాయి. ఇప్పటికే కూరగాయల ధరలు పెరిగి సామాన్యులకు చుక్కలు చూపిస్తుంటే ఇప్పుడు అవి సరిపోదు అన్నట్టుగ వంటనూనెలతో పాటు సబ్బుల ధరలు కూడా పెరుగుతున్నాయి. నెల రోజుల నుంచి వీటి ధరలు పెరుగుతూనే వస్తున్నాయని తెలిసిందే. పప్పులు, ఉప్పుల ధరలతో పాటు వంటనూనె ధరలు కూడా సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. నూనెల్లో పామాయిల్ ధర […]
ప్రధానాంశాలు:
OIls Costlier Price hike : పెరిగిన వంటనూనెల ధరలు.. ఫెస్టివల్ టైం ప్రజల కళ్లల్లో కన్నీళ్లు..!
OIls Costlier Price hike : నిత్యావసరాల ధరలు మండిపోతున్న ఈ టైం లో ఒకదానికి మరొకటి అన్నట్టుగా రేట్లు పెరుగుతూ వెళ్తున్నాయి. ఇప్పటికే కూరగాయల ధరలు పెరిగి సామాన్యులకు చుక్కలు చూపిస్తుంటే ఇప్పుడు అవి సరిపోదు అన్నట్టుగ వంటనూనెలతో పాటు సబ్బుల ధరలు కూడా పెరుగుతున్నాయి. నెల రోజుల నుంచి వీటి ధరలు పెరుగుతూనే వస్తున్నాయని తెలిసిందే. పప్పులు, ఉప్పుల ధరలతో పాటు వంటనూనె ధరలు కూడా సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. నూనెల్లో పామాయిల్ ధర నెల రోజుల్లో ఏకంగా 37 శాతం పెరిగింది. ఇలా ఒక్కసారిగా పెరిగిన పామాయిల్ రేటు వల్ల సామాయ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇక ఆవనూనె మీద 29 శతం పెరిగింది. బయట రెస్టారెంట్లు, స్వీట్ షాప్స్, హోటల్స్ లాంటివి పెరిగిన వంటనూనెల వల్ల మెనూలో ధరల్ని కూడా పెంచే అవకాశం ఉంది. సో అలా కూడా జేబుకి చిల్లు పడక తప్పేలా లేదు.
OIls Costlier Price hike ద్రవ్యోల్బణం లెక్క ప్రకారంగా..
సెప్టెంబర్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం లెక్క ప్రకారంగా చూస్తే 5.5 శాతంగా నమోదైంది. ఈ 9 నెలలలో గరిష్ఠ్ స్థాయి అవ్వడం విశేషం. నిత్యావసర ధరలు, కూరగాయల ధరలు పెరగడం లాంటివి ద్రవ్యోల్బణం మీద ప్రభావితం చేస్తాయి. ఆ ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. లాస్ట్ మంత్ కేంద్ర ప్రభుత్వం సోయాబీన్, సన్ ఫ్లవర్, ఫామాయిల్ దిగుమతి సుంకాన్ని పెంచడం వల్ల వంటనూనెల ధరలు పెరిగాయి.
మరోపక్క ఇంటర్నేషనల్ మార్కెట్ లోనూ ధరలు వృద్ధి చేయడం కూడా ప్రతికూల అంశాలుగా మారాయి. సోయాబీన్, క్రూడ్ ఫాం, సన్ ఫ్లవర్ ఆయిల్ ధరలు 16.8,10.6,12.3 శాతం పెరిగాయి. సన్ ఫ్లవర్ ఆయిల్ దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం 5.5 శతం నుంచి ఒక్కసారిగా 27.5 శాతానికి పెంచింది. దాని వల్ల వంటనూనెల ధరలు బాగా పెరిగాయి. ప్రతి ఇంట్లో వంట లేకుండా ఎలాంటివి వండటం కుదరదు అందుకే ప్రజలు ఈ పెరిగిన రేట్లను చూసి లబోదిబో అంటున్నారు.