Blood Filter : కేవలం రెండు ఆకులు చాలు .. బాడీలో ఉన్న ప్రతి రక్తపు బొట్టు ఫిల్టర్ అవుతుంది ..!!
Blood Filter : వాముకు ప్రత్యేక సువాసన ఉంటుంది. అలాగే వాము ఆకులు కూడా అదే సువాసన కలిగి ఉంటుంది. వాము ఆకుతో బజ్జీలను చేసుకుంటారు. అయితే వాము ఆకులను పచ్చడి చేసుకొని తింటే అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. రక్తనాళాలను సంకోచించడానికి తగ్గించి వ్యాకోచించడానికి వాము ఆకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. బిపి తగ్గించడానికి వాము ఆకు అద్భుతంగా పనిచేస్తుంది. శరీరంలో ఎలర్జీలను తగ్గించడానికి, నిమోనియా రాకుండా వామాకు అద్భుతంగా పని చేస్తుంది. వాము ఆకులో ఉండే ప్రోటీన్స్ కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చేస్తాయి.
వాము అరుగుదలకు, గ్యాస్ ఏర్పడకుండా ఉండడానికి వాడతారని తెలుసు. అయితే వాము ఆకు కూడా త్వరగా అరగడానికి, పొట్టలో అల్సర్లు, గ్యాస్ సమస్యలు ఉంటే తొలగిస్తుంది. అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బులు వంటి సమస్యలను తగ్గించడానికి వాము ఆకు బాగా పనిచేస్తుంది. వాము ఆకు తీసుకోవడం వలన లోపల ఉండే బ్యాక్టీరియా, వైరస్ లు చచ్చిపోతాయి. ఈ బ్యాక్టీరియా, వైరస్ లను చంపే గుణం వాము ఆకులో పుష్కలంగా ఉంటుంది. అందుకే వామును వారానికి ఒకసారైనా తినాలని వైద్యులు సూచిస్తున్నారు.
వాము నీళ్లను బాగా మరిగించి తాగితే వెంటనే కడుపునొప్పి తగ్గిపోతుంది. జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తొలగిపోతాయి. జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. కాబట్టి వాము ఆకును రోటి పచ్చడి లాగా చేసుకొని వారానికి ఒక్కసారి అయినా లేదా వీలైనప్పుడల్లా తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ చేరితే గుండె జబ్బులకు దారి తీస్తాయి. ఈ సమయంలో చెడు కొలెస్ట్రాల్ అనేది పెరగకుండా ఉండడానికి వాము ఆకు బాగా ఉపయోగపడుతుంది. అందుకే వాము ఆకులను పచ్చడి లాగా చేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.