Eye Cancer : మీ కన్ను ఇలా మారితే దానికి సంకేతమే… వెంటనే అప్రమత్తం అవ్వండి…!
ప్రధానాంశాలు:
Eye Cancer : మీ కన్ను ఇలా మారితే దానికి సంకేతమే...వెంటనే అప్రమత్తం అవ్వండి...!
Eye Cancer : ప్రస్తుతం భారత్ లో ఎదుర్కొంటున్నటువంటి అతి పెద్ద ఆరోగ్య సమస్యలలో క్యాన్సర్ కూడా ఒకటి. ఈ క్యాన్సర్ అనేది వయసుతో సంబంధం లేకుండా ఈ మహమ్మారి అనేది జనాలను అటాక్ చేస్తూ ఉన్నది. ప్రస్తుతం ఆధ్యాత్మిక వైద్యం అందుబాటులో ఉన్నప్పటికీ కూడా సమయానికి గుర్తించకపోయినట్లయితే ప్రాణాలను తీసేస్తుంది. ఈ డిసీజ్. క్యాన్సర్ కణాలు అనేవి శరీరంలో ఎక్కడైనా పెరగవచ్చు. అరుదైన క్యాన్సర్లలో కంటి క్యాన్సర్ కూడా ఒకటి. దీని మొదలు లక్షణాలను గుర్తించినట్లయితే అప్రమత్తమై వెంటనే ఈ వ్యాధిని జయించవచ్చు. కంటి క్యాన్సర్ కు సంబంధించిన లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం..
Eye Cancer కంటి క్యాన్సర్ లక్షణాలు
– కంటిలో తెల్లటి ప్రతిబింబం అనేది మీకు కనిపిస్తుంది.
– చూస్తున్నప్పుడు కంప్లీట్ దృశ్యం అనేది స్పష్టంగా కనబడకుండా కొంత వరకు చీకటిగా కనిపిస్తుంది.
– దృష్టి అనేది కూడా అస్పష్టంగా మారుతుంది.
– దేనిని చూసినా కూడా రెండుగా కనిపిస్తాయి.
– కనురెప్పల కింద చిన్న గడ్డల్లాగా తగులుతున్న వెంటనే డాక్టర్లను సంప్రదించటం చాలా మంచిది. కను రెప్పల పై చిన్న ఎర్రటి పూతలగా వస్తే అప్పుడు మీరు ఏమాత్రం అశ్రద్ధ చేయకండి.
– కనురెప్పల కు సంబంధించిన వెంట్రుకలు రాలిపోతున్నట్లయితే వెంటనే డాక్టర్లు కన్సల్ట్ చేయడం మంచిది.
– కనురెప్పల్లో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కూడా ఉన్నది.
– కంటి చివరణ తరచుగా చిన్న చిన్న మెరుపులు అనేవి వస్తూ ఉంటాయి.
– కంటి నొప్పి అనేది దీర్ఘకాలం ఉన్నప్పటికీ, ఉబ్బినట్టు అనిపించిన, కన్నీళ్ళల్లో రక్తపు బొట్టు వస్తున్న,కంటిలో నల్ల గుడ్డు స్థానం మారిన వెంటనే డాక్టర్ను సంప్రదించటం మంచిది..
కంటి క్యాన్సర్ ఎక్కువగా వయసు పైబడిన వారిలో వస్తుంది అలా అని తక్కువ వయసు వారికి రాదు అని కాదు. అలాగే వారసత్వం నుండి కూడా ఇది వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉన్నది…