Eye conjunctivitis : వేగంగా విస్తరిస్తున్న కండ్ల కలక వ్యాధి .. ఒక్కరోజే 1000 కేసులు నమోదు .. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే ..
Eye conjunctivitis : ప్రస్తుతం వర్షాల కారణంగా ప్రజలు సీజనల్ వ్యాధులతో బాధపడుతున్నారు. ఇప్పుడు జ్వరాలతో పాటు కండ్ల కలక సమస్య ఎక్కువగా ఉంది. తేమతో కూడిన వాతావరణం వలన కంటి సమస్యలు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్రలో ఎక్కువగా కండ్ల కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో ఓ గ్రామంలో ఐదు రోజుల్లో 2300 కేసులు నమోదు అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా కండ్ల కలక కేసులు పెరుగుతున్నాయి. ఏపీ, తెలంగాణలో వెయ్యికి పైగా కేసులు వచ్చాయి. హైదరాబాదులో ఓ ఆసుపత్రిలో ఒక్కరోజే 400 కేసులు వచ్చాయని ఆసుపత్రి బృందం చెప్పారు. ముఖ్యంగా పిల్లల్లో కళ్ళ కలకలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పిల్లలు ఆరోగ్యం దృష్ట్యా కొన్ని ఆరోగ్య జాగ్రత్తల గురించి సలహాలు తీసుకోవాలి.
చేతులు కడగడం, కళ్ళు ముట్టుకోకపోవడం చేతి రుమాళ్లను ఒకరితో పంచుకోకపోవడం, సామాజిక దూరం పాటించడం లాంటివి తప్పకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. కండ్ల కలక కేసులు ఎక్కువగా బ్యాక్టీరియా, వైరస్, ఎలర్జీలు, ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు. కళ్ళు ఎర్రబారడం, దురద, కనురెప్పలు ఉబ్బినట్టు అనిపించడం దీని లక్షణాలు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయితే కళ్ళ నుంచి నలక ఎక్కువగా రావచ్చు. అయితే కంట్లో డ్రాప్ వేసుకోవడం వలన వీటి నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. ఈ లక్షణాలన్నీ తగ్గడానికి వారం నుంచి రెండు వారాల సమయం పట్టవచ్చు.
పిల్లలు చేతులు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లలకు చేతులు శుభ్రంగా ఉంచుకునేలా అలవాటు చేసుకోవాలి. దానివల్ల క్రీములు చేరవు. లేదంటే చేతులు కంట్లో పెట్టుకున్నప్పుడు ఇన్ఫెక్షన్లు వచ్చా అవకాశం ఉంటుంది. పిల్లలు కళ్ళు తరచు ముట్టుకోకుండా, నలవకుండా చూసుకోవాలి. దానివల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం తగ్గుతుంది. దీనిని పిల్లలకి అర్థం అయ్యేలా తెలియజేయాలి. తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు వైరస్ బారిన పడకుండా టిష్యూ అడ్డు పెట్టుకోవడం అలవాటు చేయాలి. దాని వలన గాలి ద్వారా ఇన్ఫెక్షన్లు ఒకరి నుంచి మరొకరికి సోకకుండా ఉంటాయి. అలాగే కండ్లకలక వచ్చినవాళ్లు కళ్లద్దాలు ధరించడం మంచిది. అలాగే వాటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. తోటి పిల్లలకు ఇన్ఫెక్షన్ ఉంటే కాస్త దూరంగా ఉండాలని పిల్లలకు సూచించాలి.