Fenugreek Leaves : వారానికి రెండు సార్లు ఈ ఆకు కూరను తిన్నారంటే…. మీ ఆరోగ్యానికి అద్భుతమైన సంజీవిగా మారుతుంది…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Fenugreek Leaves : వారానికి రెండు సార్లు ఈ ఆకు కూరను తిన్నారంటే…. మీ ఆరోగ్యానికి అద్భుతమైన సంజీవిగా మారుతుంది…?

 Authored By ramu | The Telugu News | Updated on :27 March 2025,8:00 am

ప్రధానాంశాలు:

  •  Fenugreek Leaves : వారానికి రెండు సార్లు ఈ ఆకు కూరను తిన్నారంటే.... మీ ఆరోగ్యానికి అద్భుతమైన సంజీవిగా మారుతుంది...?

Fenugreek Leaves : మనం నిత్యం ఎక్కువగా ఆకుకూరలను తింటూ ఉంటాం. అలాంటి ఆకుకూరలో పాలకూర, తోటకూర, బచ్చలి కూర, గోంగూర, చుక్కకూర లాంటీ ఆకుకూరలు తరచూ తింటూ ఉంటాం. అయితే, అలాంటి ఆకుకూరల్లో మెంతికూర కూడా ఆరోగ్యానికి సంజీవిగా పనిచేస్తుంది. మెంతులు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో, మెంతి కూర కూడా ప్రయోజనకరంగానే ఉంటుంది. ఇంటి కూరను వారానికి కనీసం రెండుసార్లు లేదా ఒక్కసారి అయినా, తింటే శరీరంలో అద్భుతమైన మార్పులని మనం గమనించవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ మెంతికూర తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం…

Fenugreek Leaves వారానికి రెండు సార్లు ఈ ఆకు కూరను తిన్నారంటే మీ ఆరోగ్యానికి అద్భుతమైన సంజీవిగా మారుతుంది

Fenugreek Leaves : వారానికి రెండు సార్లు ఈ ఆకు కూరను తిన్నారంటే…. మీ ఆరోగ్యానికి అద్భుతమైన సంజీవిగా మారుతుంది…?

కూరగాయలతో పోలిస్తే ఆకుకూరల్లో ఆరోగ్యానికి ఎంతో మంచి వని పోషకాహార నిపుణులు తెలియజేస్తున్నారు. ఎందుకంటే, ఈ ఆకుకూరలు తేలిగ్గా జీర్ణం కాగలవు. పైగా ఆకుకూరల్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. మన శరీరం నిత్యం ఎదుర్కొనే కొన్ని అనారోగ్య సమస్యలను ఆకుకూరతో నివారించవచ్చు. అందుకే, వారంలో కనీసం మూడుసార్లు ఆకుకూరలు తప్పకుండా తినాలని సూచిస్తున్నారు. ఈ ఆకుకూరల్లో ముఖ్యమైనది మెంతికూర.

Fenugreek Leaves మెంతికూరలో ఉండే పోషకాలు

మెంతికూరలో ఉండే కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ డి, ఫైబర్ కారణంగా ఆరోగ్యం కుదుటపడుతుంది. ముఖ్యంగా గుండెను ఆరోగ్యంగా ఉంచగలదు. శరీరంలో పేరుకుపోయిన ఆ చెడు కొలెస్ట్రాలను సులభంగా తొలగిస్తుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి, రెండుసార్లు మెంతికూరను వారానికి తినడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడతుంది. అజీర్తి,కడుపునొప్పి,గ్యాస్ సమస్యలు ఉన్నవారికి మెంతికూర అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఫైబర్ ఉండటం చేత కడుపు నిండిన ఆనుభూతి కలుగుతుంది. దింతో ఎక్కువ ఆకలి ఉండదు. తద్వారా బరువు తగ్గటానికి సులభతరం అవుతుంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే.. షుగర్ వ్యాధిగ్రస్తులకు మెంతికూర దివ్య ఔషధంగా పనిచేస్తుంది. మెంతికూరలో పోషకాలు శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడానికి దోహదం చేస్తుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో ఉండే పోషకాలు చర్మంపై ముడతల్ని దూరం చేస్తాయి. ధర్మాన్ని యవ్వనంగా,తాజాగా ఉంచుతాయి. స్వభావరిత్యా మెంతికూర వేడి చేస్తుంది. కాబట్టి, వారానికి రెండు సార్లు తీసుకుంటే చాలు. ఆయుర్వేద వైద్యంలో మెంతి ఆకులకు చాలా ప్రాధాన్యత ఉంది. తీరంలో హార్మోన్లను బ్యాలెన్స్ చేయడంలో మెంతికూర అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా స్త్రీలకు పీరియడ్స్ సమస్యలు కూడా మెంతికూర ఉపశమనాన్ని అందిస్తుంది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది