Food : మనిషన్నాక తినక తప్పదు. ఏదో ఒకటి తింటేనే మనిషి బతుకుతాడు. లేదంటే.. మనిషికి బతుకే ఉండదు. మనిషి జీవితంలో బతికినన్ని రోజులు ఏదో ఒకటి తినాల్సిందే. లేకపోతే బతకలేడు. అయితే.. ఏం తినాలి? ఏం తింటే మనిషి ఆరోగ్యంగా బతుకుతాడు.. అనేదానిపై చాలామందికి క్లారిటీ లేదు. ఏదో ఒకటి కడుపు నిండాలి కాబట్టి తినేయడమే. ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఆహారపు అలవాట్లు ఉంటాయి. కొందరికి నాన్ వెజ్ అంటే ఇష్టం.. ఇంకొందరికి వెజ్ అంటే ఇష్టం. ఇలా.. రకరకాలుగా ఆహారపు అలవాట్లు ఉంటాయి. కొందరికి పండ్లంటేనే ఇష్టం. ఇంకొందరు కేవలం ఆకు కూరలనే ఎక్కువగా ఇష్టపడుతుంటారు.
అయితే.. చాలామందికి నిజంగా ఏం తినాలో తెలియదు. కాకపోతే.. ఆరోగ్యం పేరుతో ఏవేవో తినేస్తుంటారు. లేనిపోని సమస్యలను కొని తెచ్చుకుంటారు. చాలామంది సలాడ్ లను కూడా ఎక్కువగా తీసుకుంటారు. భోజనంతో పాటు సలాడ్ లను తీసుకుంటారు. సలాడ్ అంటే.. పచ్చి కూరగాయలను ముక్కలుగా కోసి.. అన్నీ కలుపుకొని తినేయడం. నిజానికి.. సలాడ్ అనేది ఆరోగ్యానికి మంచిదే. కానీ.. అది ఎప్పుడు.. అన్నం తినకుండా.. కేవలం సలాడ్స్ ను తిన్నప్పుడే అది బాగుంటుంది. కానీ.. అన్నం పుష్టిగా తిని.. ఆ తర్వాత కొందరు సలాడ్స్ ను కూడా లాగించేస్తుంటారు. అలా చేస్తే.. అన్నం జీర్ణం కాదు. జీర్ణ సమస్యలు వస్తాయి.
చాలామంది పెరుగులో ఉప్పు కలుపుకొని తింటుంటారు. ఉప్పు అనేది మనిషికి ఎంత అవసరమో అంతే తినాలి. అది ఎక్కువైతే హైబీపీ, ఇతర సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. కూరల్లో వేసే ఉప్పు శరీరానికి సరిపోతుంది. అలా కాదని.. ఉప్పును పెరుగులో, ఇతర పదార్థాల్లో ఎక్కువగా వేసుకొని తింటే లేని పోని సమస్యలు రావడం ఖాయం. పెరుగులో ఉప్పు బదులు.. కాసింత జిలకర్ర పొడి లేదా వాము పొడి కలుపుకొని తింటే.. శరీరానికి ఎంతో మేలు చేకూరుతుంది.
కొంతమంది చింతపండుతో చేసిన చారును తెగ తాగుతుంటారు. అసలు.. చింతపండును ఎక్కువగా అస్సలు వాడకూడదు. చింతపండు శరీరానికి అంత మంచిది కాదు. ఉప్పు, పులుపు, కారం, మసాలాలు, కొవ్వు ఎక్కువగా ఉన్న పదార్థాలను ఎంత తగ్గిస్తే అంత మేలు. వాటి బదులు.. చిరు ధాన్యాలు, పళ్లు, కూరగాయలను ఎక్కువగా ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.
ఇది కూడా చదవండి ==> ఉసిరికాయను రోజూ తినడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే వెంటనే కొనుక్కొని తినేస్తారు..!
ఇది కూడా చదవండి ==> ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే కొలెస్టరాల్ టెస్ట్ చేయించుకోండి.. లేదంటే మీరే నష్టపోతారు?
ఇది కూడా చదవండి ==> గోధుమ పిండిని ఎక్కువగా వాడుతున్నారా? దాని వల్ల జరిగే నష్టాలు తెలుసుకోకపోతే మీ లైఫ్ డేంజర్ లో ఉన్నట్టే?
ఇది కూడా చదవండి ==> ఊబకాయం సమస్య వేధిస్తోందా? ఈ ఒక్క పని చేయండి చాలు.. మీరే ఆశ్చర్యపోతారు?
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.