Health : రోజూ తినే అన్నం దగ్గరే మనం చాలా తప్పు చేస్తున్నాం.. ఆ ఆహారమే ఎంత చెడు చేస్తోందో తెలుసుకోండి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health : రోజూ తినే అన్నం దగ్గరే మనం చాలా తప్పు చేస్తున్నాం.. ఆ ఆహారమే ఎంత చెడు చేస్తోందో తెలుసుకోండి..!

 Authored By jagadesh | The Telugu News | Updated on :5 July 2021,1:59 pm

Food : మనిషన్నాక తినక తప్పదు. ఏదో ఒకటి తింటేనే మనిషి బతుకుతాడు. లేదంటే.. మనిషికి బతుకే ఉండదు. మనిషి జీవితంలో బతికినన్ని రోజులు ఏదో ఒకటి తినాల్సిందే. లేకపోతే బతకలేడు. అయితే.. ఏం తినాలి? ఏం తింటే మనిషి ఆరోగ్యంగా బతుకుతాడు.. అనేదానిపై చాలామందికి క్లారిటీ లేదు. ఏదో ఒకటి కడుపు నిండాలి కాబట్టి తినేయడమే. ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఆహారపు అలవాట్లు ఉంటాయి. కొందరికి నాన్ వెజ్ అంటే ఇష్టం.. ఇంకొందరికి వెజ్ అంటే ఇష్టం. ఇలా.. రకరకాలుగా ఆహారపు అలవాట్లు ఉంటాయి. కొందరికి పండ్లంటేనే ఇష్టం. ఇంకొందరు కేవలం ఆకు కూరలనే ఎక్కువగా ఇష్టపడుతుంటారు.

food creates health issues telugu

food creates health issues telugu

అయితే.. చాలామందికి నిజంగా ఏం తినాలో తెలియదు. కాకపోతే.. ఆరోగ్యం పేరుతో ఏవేవో తినేస్తుంటారు. లేనిపోని సమస్యలను కొని తెచ్చుకుంటారు. చాలామంది సలాడ్ లను కూడా ఎక్కువగా తీసుకుంటారు. భోజనంతో పాటు సలాడ్ లను తీసుకుంటారు. సలాడ్ అంటే.. పచ్చి కూరగాయలను ముక్కలుగా కోసి.. అన్నీ కలుపుకొని తినేయడం. నిజానికి.. సలాడ్ అనేది ఆరోగ్యానికి మంచిదే. కానీ.. అది ఎప్పుడు.. అన్నం తినకుండా.. కేవలం సలాడ్స్ ను తిన్నప్పుడే అది బాగుంటుంది. కానీ.. అన్నం పుష్టిగా తిని.. ఆ తర్వాత కొందరు సలాడ్స్ ను కూడా లాగించేస్తుంటారు. అలా చేస్తే.. అన్నం జీర్ణం కాదు. జీర్ణ సమస్యలు వస్తాయి.

food creates health issues telugu

food creates health issues telugu

Food : భోజనంతో పాటు వీటిని మాత్రం అస్సలు తీసుకోకండి

చాలామంది పెరుగులో ఉప్పు కలుపుకొని తింటుంటారు. ఉప్పు అనేది మనిషికి ఎంత అవసరమో అంతే తినాలి. అది ఎక్కువైతే హైబీపీ, ఇతర సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. కూరల్లో వేసే ఉప్పు శరీరానికి సరిపోతుంది. అలా కాదని.. ఉప్పును పెరుగులో, ఇతర పదార్థాల్లో ఎక్కువగా వేసుకొని తింటే లేని పోని సమస్యలు రావడం ఖాయం. పెరుగులో ఉప్పు బదులు.. కాసింత జిలకర్ర పొడి లేదా వాము పొడి కలుపుకొని తింటే.. శరీరానికి ఎంతో మేలు చేకూరుతుంది.

food creates health issues telugu

food creates health issues telugu

కొంతమంది చింతపండుతో చేసిన చారును తెగ తాగుతుంటారు. అసలు.. చింతపండును ఎక్కువగా అస్సలు వాడకూడదు. చింతపండు శరీరానికి అంత మంచిది కాదు. ఉప్పు, పులుపు, కారం, మసాలాలు, కొవ్వు ఎక్కువగా ఉన్న పదార్థాలను ఎంత తగ్గిస్తే అంత మేలు. వాటి బదులు.. చిరు ధాన్యాలు, పళ్లు, కూరగాయలను ఎక్కువగా ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.

ఇది కూడా చ‌ద‌వండి ==> ఉసిరికాయను రోజూ తినడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే వెంటనే కొనుక్కొని తినేస్తారు..!

ఇది కూడా చ‌ద‌వండి ==> ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే కొలెస్టరాల్ టెస్ట్ చేయించుకోండి.. లేదంటే మీరే నష్టపోతారు?

ఇది కూడా చ‌ద‌వండి ==> గోధుమ పిండిని ఎక్కువగా వాడుతున్నారా? దాని వల్ల జరిగే నష్టాలు తెలుసుకోకపోతే మీ లైఫ్ డేంజర్ లో ఉన్నట్టే?

ఇది కూడా చ‌ద‌వండి ==> ఊబకాయం సమస్య వేధిస్తోందా? ఈ ఒక్క పని చేయండి చాలు.. మీరే ఆశ్చర్యపోతారు?

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది