Amla : ఉసిరికాయను రోజూ తినడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే వెంటనే కొనుక్కొని తినేస్తారు..!
Amla : ఉసిరికాయ తెలుసు కదా. ఉసిరికాయను మార్కెట్ లో చూస్తే చాలు నోరూరుతుంది. ఉసిరికాయ అంటే అందరికీ ఇష్టమే. దాన్ని పచ్చడిగా చేసుకొని నిల్వగా ఉంచుకొని మరీ తింటుంటాం. ఉసిరికాయకు ఉన్న క్రేజ్ అటువంటిది. నిజానికి ఉసిరికాయ బెర్రీజాతికి చెందిన పండు. దీంట్లో ఫుల్లుగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దీంట్లో ఉండే విటమిన్లు, మినరల్స్.. శరీరానికి ఎంతో ఆరోగ్యాన్ని అందిస్తాయి. అందుకే.. ఉసిరికాయను మనం రోజూ ఆహారంలో భాగంగా చేసుకోవాలి.
ఉసిరికాయను అనేక ఆయుర్వేద మందుల్లో కూడా ఉపయోగిస్తారు. ఉసిరికాయకు ఆయుర్వేద మందుల్లోనూ మంచి ప్రాధాన్యత ఉంది. అయితే.. ఉసిరికాయను రోజూ ఒక్కటి తింటే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకున్నా నయం కాని ఎన్నో రోగాలను ఒకే ఒక్క ఉసిరికాయతో తీర్చొచ్చు. అవేంటో తెలుసుకుంటే మీరే వెంటనే మార్కెట్ కు వెళ్లి ఉసిరికాయను కొనుక్కొని తింటారు.
Amla : ఉసిరికాయలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
ఉసిరికాయను నిత్యం తీసుకుంటే.. డయాబెటిస్ రోగులకు చాలా మేలు చేస్తుంది. రక్తంలో ఉండే షుగర్ లేవల్స్ ను ఉసిరికాయ కంట్రోల్ లో ఉంచుతుంది. అలాగే.. ఉసిరికాయలో ఉండే ఫైబర్ శరీరంలో వెంటనే కరిగిపోవడం వల్ల ఎన్నో సమస్యలకు చెక్ పెట్టే అవకాశం ఉంటుంది. అందరికీ తెలిసినట్టే.. ఉసిరికాయలో ఉండే విటమిన్ సీ శరీరంలోని ఇతర పోషకాలను కూడా గ్రహించడంలో ఎంతో సాయపడుతుంది. విటమిన్ సీ పుష్కలంగా ఇందులో ఉండటం వల్ల.. కొన్ని అనారోగ్య సమస్యలు వెంటనే నయం అవుతాయి.
అలాగే.. ఉసిరిలో విటమిన్ ఏ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని బాగా మెరుగుపరుస్తుంది. కళ్లలో వచ్చే ఎటువంటి సమస్యలను అయినా ఉసిరి చెక్ పెడుతుంది. అలాగే.. ప్రస్తుత తరుణంలో మనిషికి కావాల్సిన రోగ నిరోధక శక్తిని ఉసిరి అందిస్తుంది. అందుకే ఉసిరిని రోజూ ఆహారంలో భాగంగా చేసుకుంటే.. కావాల్సినంత రోగ నిరోధక శక్తి లభిస్తుంది. ఉసిరికాయ.. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉండటం వల్ల.. శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ ను నాశనం చేస్తాయి. అలాగే.. ఉసిరి మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.
ఇది కూడా చదవండి ==> అల్లాన్ని తెగ తినేస్తున్నారా? ఈ విషయం తెలుసుకోకపోతే ప్రాణాలకే ప్రమాదం..!
ఇది కూడా చదవండి ==> ఊబకాయం సమస్య వేధిస్తోందా? ఈ ఒక్క పని చేయండి చాలు.. మీరే ఆశ్చర్యపోతారు?
ఇది కూడా చదవండి ==> ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే కొలెస్టరాల్ టెస్ట్ చేయించుకోండి.. లేదంటే మీరే నష్టపోతారు?
ఇది కూడా చదవండి ==> గోధుమ పిండిని ఎక్కువగా వాడుతున్నారా? దాని వల్ల జరిగే నష్టాలు తెలుసుకోకపోతే మీ లైఫ్ డేంజర్ లో ఉన్నట్టే?