Korralu Benefits : కొర్రలు చేసే అద్భుతాలు తెలిస్తే వెంటనే తినడం మొదలు పెడతారు…!!
Korralu Benefits : మనం తినే ఆహారం మన శరీరానికి అన్ని విధాలుగా మేలు చేసేవిగా ఉండాలి. వాటి ద్వారా అందే శక్తి మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేదిగా ఉండాలి. శరీరానికి శక్తితో పాటు వివిధ పోషకాలు అందించే కోర్రలు ఇప్పుడు చాలా చోట్ల ఆహారంగా తీసుకుంటున్నారు.. కడుపునొప్పి సమస్య ఏదైనా ఉన్నా..అరుగుదల సమస్య ఉన్నా కూడా కొర్రలు అద్భుతంగా పనిచేస్తాయి. కిడ్నీలో రాళ్లు లేదా కిడ్నీకి సంబంధించిన వ్యాధులు కూడా కొర్రలు దూరం చేస్తాయి. కొర్రలు రాత్రిపూట నిద్రపోయే ముందు శుభ్రం చేసుకుని నీళ్లలో నానబెట్టి ఉదయం తగినన్ని నీళ్లు వేసి ఉడికించుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు పెప్పర్ పౌడర్ లేదా కలుపుకొని తాగొచ్చు. కుదిరితే పెరుగు కూడా వేసుకుంటే ఇంకా చలువ చేస్తుంది. శరీరానికి శక్తితో పాటు వివిధ పోషకాలు అందించే కొర్రలు ఇప్పుడు చాలా చోట్ల ఆహారంగా తీసుకుంటున్నారు..
లభించే ఉపయోగాలు ఇప్పుడు తెలుసుకుందాం. బియ్యాన్ని ఎక్కువగా పాలిష్ చేయడం వలన దానిలో ఉండే పోషక విలువలు తగ్గిపోతాయి. తద్వారా అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఈ సమస్యను అధిగమించేందుకు చిరుధాన్యాలుగా పిలుచుకునే కొర్రలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వరి బియ్యం వండుకున్నట్లుగానే కొర్ర బియ్యాన్ని వండుకోవచ్చు.. వీటిని మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు.. కొర్రలు తీపి వగరు రుచిని కలిగి ఉంటాయి. వీటిలో ఆంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కొర్రల్లో అధికంగా పీచు పదార్థం, మాంసకృతులు, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం భాస్వరం వంటి అనేక ఖనిజాలు ఉంటాయి. చిన్న పిల్లలకు గర్భిణీలకు మంచి ఆహారం ఉదర సంబంధ వ్యాధులకు కొర్రలు తినడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది.
కడుపునొప్పి మూత్రంలో మంట ఆకలి లేకపోవడం అతిసారం వంటి సమస్యలకు కొర్రలతో చెక్ పెట్టవచ్చు. కాన్స్టిట్యూషన్ ఇట్లాంటివి అన్న ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూడా తగ్గిపోతాయి. బలహీనత కారణంగా తీవ్రమైన రుగ్మతలు వస్తాయి.ఆలాంటి సమయంలో ఆహారంలో కొర్రలు చేర్చుకోవడం వల్ల ఇటువంటి నాడీ బలహీనతను అధిగమించేందుకు కొర్రలు చాలా బాగా ఉపయోగపడతాయి. నాడీ వ్యవస్థ పై సానుకూల ప్రభావాన్ని చూపే మోరల్ విటమిన్ వీటిలో లభిస్తుంది. మల్టిపుల్స్ ఫెలోసిస్ రోగులకు ఇది ఎంతగానో సహాయపడుతుంది.కేంద్రనాడి వ్యవస్థను నిర్వహించడానికి ప్రోటీన్ అవసరం .అలాంటి ప్రోటీన్ కొర్రలో అధికంగా లభిస్తుంది. కొర్రలను రెగ్యులర్గా తినడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా కాపాడుతుంది. అదేవిధంగా కూడా రక్తహీనతను తగ్గిస్తుంది…