Ghee and Butter : నెయ్యి, వెన్న.. రెండింట్లో ఏది ఆరోగ్యానికి మంచిదో మీకు తెలుసా..?
Ghee and Butter : నెయ్యి అన్నా.. బటర్ అన్నా ఇష్టం ఉండని వాళ్లు ఉండరు. బటర్ అంటే వెన్న. ఈ రెండు కూడా పాల ఉత్పత్తులే. పాలను పెరుగుగా చేసి.. పెరుగ మీగడ నుంచి వచ్చేవే వెన్న, నెయ్యి. వెన్నను మంట మీద పెట్టి కాగబెడితే.. నెయ్యిగా మారుతుంది. దాని వల్ల.. నెయ్యి అయినా వెన్న అయినా రెండూ ఒకటే అని అందరూ అనుకుంటారు. కానీ.. ఆ రెండూ ఒకటి కాదు. నెయ్యి వేరు.. వెన్న వేరు. ఆ రెండింట్లో చాలా తేడాలు ఉన్నాయి. అసలు.. ఈ రెండింట్లో ఉన్నా తేడాలు ఏంటి? ఈ రెండింట్లో ఏది మంచిది? ఏది మంచిది కాదు అనే విషయాలు చాలామందికి తెలియదు.

ghee vs butter which is better for health
నెయ్యి, వెన్న.. రెండూ ఆరోగ్యానికి మంచివి కావు. వాటిలో కొలెస్టరాల్ ఎక్కువగా ఉంటుంది. అవి తింటే.. బరువు పెరుగుతారు అని అందరూ అంటుంటారు. వీటి మీద చాలామందికి చాలా డౌట్లు, అపోహలు ఉన్నాయి. వాటన్నింటి గురించి క్లియర్ గా ఇప్పుడు తెలుసుకుందాం.

ghee vs butter which is better for health
Ghee and Butter : నెయ్యి మంచిదా? బటర్ మంచిదా?
నెయ్యి, బటర్ లేదా వెన్న.. రెండింట్లోనూ ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అవును.. ఆయుర్వేదంలో నెయ్యి, వెన్నకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. వెన్నను తీసుకుంటే.. దగ్గును తగ్గిస్తుంది. అలాగే.. హెమరాయిడ్స్ అనే వ్యాధిని రాకుండా వెన్న అడ్డుకుంటుంది. జీర్ణ వ్యవస్థ కూడా బాగుంటుంది. వెన్నలో శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి.

ghee vs butter which is better for health
అలాగే నెయ్యిలో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయి. నెయ్యి తెలివి తేటలను పెంచుతుంది. శరీరంలో మెటబాలిజం రేటును పెంచుతుంది. ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతుంది. వాతం ఉన్నా పిత్త సమస్యలు ఉన్నా తగ్గిస్తుంది. నెయ్యిని నిత్యం తీసుకోవడం వల్ల.. శరీరంలోని చెడు కొలెస్టరాల్ కరిగి.. మంచి కొలెస్టరాల్ పెరుగుతుంది. దాని వల్ల బరువు తగ్గుతారు.

ghee vs butter which is better for health
కాకపోతే.. వెన్న కంటే కూడా నెయ్యి చాలా రోజులు నిలువ ఉంటుంది. అలాగే.. వెన్న కంటే కూడా నెయ్యిలో ఎక్కువ ఉపయోగాలు ఉన్నాయి. అయితే.. కొందరు డైరెక్ట్ గా పాల నుంచే నెయ్యిని తీస్తుంటారు. అది మంచిది కాదు. నెయ్యిని పెరుగు ద్వారా వచ్చే వెన్న నుంచి తీసిందైతేనే ఆరోగ్యానికి మంచిది.
ఇది కూడా చదవండి ==> షుగర్ వ్యాధితో బాధపడుతున్నారా? ఈ టీని నిత్యం తీసుకోండి.. షుగర్ ను తగ్గించుకోండి..!
ఇది కూడా చదవండి ==> ఏ రాశి వారు ఏ యోగాసనం వేస్తే మంచిదో తెలుసా?
ఇది కూడా చదవండి ==> ఉల్లిపాయ రసం అమృతం లాంటిది.. నిత్యం దీన్ని తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!
ఇది కూడా చదవండి ==> డయాబెటిస్ ఉన్న వారికి గుడ్ న్యూస్ …లాలాజలంతో షుగర్ పరీక్ష ?