Hair Tips : బట్టతలతో బాధపడుతున్నారా.. అయితే ఒకసారి ఇది ట్రై చేయండి.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hair Tips : బట్టతలతో బాధపడుతున్నారా.. అయితే ఒకసారి ఇది ట్రై చేయండి..

 Authored By aruna | The Telugu News | Updated on :8 August 2022,3:00 pm

Hair Tips : ప్రస్తుత ఆధునిక కాలంలో యువత కూడా ఎక్కువగా జుట్టు రాలిపోయే సమస్యను ఎదుర్కొంటున్నారు. చిన్నవయసులోనే బట్టతల రావడంతో చాలామంది బాధపడుతున్నారు. జుట్టు రాలడం అనే సమస్య స్త్రీలలో ఎక్కువగా ఉంటుంది అనుకుంటాం కానీ పురుషులలో కూడా ఇది పెద్ద సమస్యగా మారుతుంది. దీనికి కారణం మానసిక ఒత్తిడి, చెడు ఆహారపు అలవాట్లు, గంటలకొద్దీ స్మార్ట్ ఫోన్ల వినియోగం ఇలా కొన్ని కారణాల వలన బట్టతల రావటం జరుగుతుంది అని నిపుణులు అంటున్నారు. మారుతున్న కాలంలో చిన్న వయసులోనే బట్టతల రావడం మొదలవుతుంది. జుట్టు రాలడాన్ని నివారించడానికి పురుషులు వివిధ ఆహారాలను చికిత్సలను తీసుకుంటారు. అయినా ఎటువంటి మార్పు ఉండదు. వీటి వలన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇంట్లో కొన్ని పదార్థాల ద్వారా రెమిడీని తయారు చేసుకుంటే జుట్టు రాలడం సమస్య నుండి బయటపడవచ్చు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

జుట్టు రాలే సమస్యతో బాధపడేవారు వివిధ రకాల ట్రీట్మెంట్లను తీసుకునే బదులు ఇంట్లోని కొన్ని వస్తువులతో సులువుగా ఆ సమస్య నుండి బయటపడవచ్చు. ముఖ్యంగా ఉల్లిపాయ అనేది జుట్టు పెరుగుదలకు బాగా పనిచేస్తుంది. జుట్టుకు సరిపడా ఉల్లిపాయను తీసుకొని దానిని మిక్సీలో మెత్తగా రసం లాగా పట్టుకోవాలి. తర్వాత ఈ రసాన్ని జుట్టు మొత్తానికి అప్లై చేయడం వలన తలలోని పోలికల్స్ బలపడతాయి. ఈ ఉల్లిపాయ రసం జుట్టు రాలడాన్ని ఆపుతుంది. అంతేకాకుండా ఉల్లిపాయ రసం కొత్త జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. ప్రతిరోజు ఉల్లిపాయ రసాన్ని జుట్టుకు రాసుకోవడం వలన బట్టతల మాయమవుతుంది. జుట్టు ఊడిపోవడానికి మరొక కారణం ఒత్తిడి. పురుషులలో బట్టతలకు ఒత్తిడి కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. ఒత్తిడి వలన జుట్టు రాలిపోతుంది. టెన్షన్, ఆందోళన నుండి బయట పడాలి.

Hair Tips for Bald problems

Hair Tips for Bald problems

ఒత్తిడిని తగ్గించుకోవడానికి రోజు వ్యాయామం చేస్తూ ఉండాలి. దీనితోపాటు మంచి నిద్ర కూడా ఒత్తిడిని తగ్గించడానికి మంచి మార్గం. పుదీనాతో మన జుట్టు సమస్యలను తగ్గించుకోవచ్చు. పుదీనాతో చేసిన పెప్పర్మెంట్ ఆయిల్ ను జుట్టుకు రాయడం వలన మంచి ప్రయోజనం పొందవచ్చు. పెప్పర్మెంట్ ఆయిల్ లో విటమిన్ ఏ, సి క్యాల్షియం ,ఖనిజాలు మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. పెప్పర్మెంట్ ఆయిల్ ను తలకు పట్టించడం వలన రక్త ప్రసరణ బాగా జరిగి జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. ఇది కాకుండా పురుషులు కొబ్బరి నూనె ఆలివ్ నూనెను కూడా ఉపయోగించవచ్చు. బట్టతల ఉన్నవారు వీటిని అనుసరించడం వలన కొద్ది రోజుల్లోనే ఊడిన జుట్టు దగ్గర కొత్త వెంట్రుకలు వస్తాయి. అలాగే వీటి వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది