Hair Tips : వాల్ నట్స్ తో ఇలా చేశారంటే… జుట్టు రాలడం తగ్గిపోతుంది…!
Hair Tips : సాధారణంగా డ్రై ఫ్రూట్స్ మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో అందరికీ తెలుసు. ముఖ్యంగా వాల్ నట్స్ ప్రాణాంతక వ్యాధులైన క్యాన్సర్, డయాబెటిస్ వంటి వ్యాధులను తగ్గిస్తాయి. ఈ వాల్ నట్స్ బరువు తగ్గించడంలో బాగా సహాయపడతాయి. ఇందులో ఫైబర్ మరియు ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. దీనిని బ్రెయిన్ ఫుడ్ అని కూడా అంటారు. దీనిని తీసుకోవడం ద్వారా జ్ఞాపకశక్తి చురుకుగా మారుతుంది. అయితే వాల్ నట్స్ ను తినడం వలన జుట్టుకు చాలా ఆరోగ్యకరమని నిపుణులు అంటున్నారు. జుట్టు పెరుగుదలకు వాల్ నట్స్ చాలా మంచివన్ని ఇది స్కాల్ప్ ను ఆరోగ్యకరంగా ఉంచుతుంది.
వాల్ నట్లను తింటే జుట్టు రాలడం ఇతర సమస్యలకు చెక్ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. జుట్టుకు వాల్ నట్స్ ను ఉపయోగించడం వలన జుట్టు పెరుగుదల మెరుగుపరుస్తుంది. వాల్ నట్స్ జుట్టు నుంచి చుండ్రు, దురద సమస్యను తొలగిస్తుంది. జుట్టు నల్లబడుతుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. వాల్ నట్స్ లో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి జుట్టు పెరుగుదలను కూడా మెరుగుపరుస్తుంది. అందువలన ప్రతిరోజు రెండు వాల్నట్లను తినాలి.
జుట్టుపై వాల్ నట్లను ఉపయోగించడానికి రెండింటినీ లేదా సరిపడే విధంగా తీసుకోవాలి. ఒకటిన్నర కప్పు వెజిటేబుల్ ఆయిల్ లో వేసి కాసేపు మరిగించాలి. ఆ తర్వాత దానిని ఫిల్టర్ చేసి జుట్టుకు పట్టించాలి. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. దీంతో చుండ్రుకు చెక్ పెట్టవచ్చు. పెరుగు వాల్నట్ పొడిని బాగా కలపాలి. ఆ తర్వాత తలకు అప్లై చేసి కాసేపు ఉంచాలి. తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి. దీనివలన జుట్టుకు మంచి పోషకాలు అంది సమస్యలన్నీ దూరమవుతాయి.