Hair Tips : ఆవనూనెలో ఇది కలిపి రాశారంటే… ఊడిన జుట్టు త్వరగా పెరుగుతుంది…

Authored By aruna | The Telugu News | Published on: July 31, 2022, 3:00 pm

Hair Tips : ఈ రోజుల్లో చాలామందికి జుట్టు రాలే సమస్య ఎక్కువవుతుంది. దీనికి కారణం మన దేశంలో రోజురోజుకీ పెరుగుతున్న కాలుష్యం, తినే ఆహారంలో పోషకాలు లోపించడం వలన ఇలా పలు కారణాల వలన చాలామంది జుట్టు రాలే సమస్య బారిన పడుతున్నారు. కనుక ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా జుట్టు రాలే సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. అలాగే జుట్టు రాలకుండా ఉండడానికి, జుట్టు రాలినచోట కొత్త వెంట్రుకలు రావడానికి ఆవనూనెలో దీనిని కలిపి రాశారంటే జుట్టు బాగా పెరుగుతుంది. ఇది ఒక ఆయుర్వేదిక్ రెమిడి. ఈ రెమిడీ జుట్టు పెరగటానికి బాగా సహాయపడుతుంది. అయితే ఇప్పుడు ఈ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

ముందుగా ఒక నాలుగు కుంకుడుకాయలని తీసుకోవాలి. ఇవి నేచురల్ షాంపూ కింద పనిచేస్తుంది. అంతేకాకుండా జుట్టు బలంగా పెరగటానికి సహాయపడుతుంది. తర్వాత రెండు శీకా కాయలను చిన్న చిన్న ముక్కలుగా తీసుకోవాలి. ఈ శీకాకాయలు మన జుట్టు స్మూత్ గా, సిల్కీగా కావడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా జుట్టు దృఢంగా ఉంటుంది. తర్వాత ఏడు లేదా ఎనిమిది ఎండు ఉసిరి ముక్కలు తీసుకోవాలి. ఇవి మన జుట్టు కు నలుపు రంగును ఇవ్వటానికి సహాయపడతాయి. అంతేకాకుండా జుట్టు ఎదుగుదలకు ఉపయోగపడతాయి. తర్వాత ఒక హాఫ్ స్పూన్ కలోంజి విత్తనాలను తీసుకోవాలి. ఇవి జుట్టు దృఢంగా పెరగటానికి సహాయపడుతుంది.

Hair Tips for Hair Fall problems

Hair Tips for Hair Fall problems

తర్వాత ఒక హాఫ్ స్పూన్ మెంతులను తీసుకోవాలి. ఇవి మన జుట్టును స్మూత్ అండ్ సిల్కీ గా చేయటానికి కుదుళ్ళ నుంచి స్టాంగ్ గా చేయడానికి సహాయపడతాయి. ఇప్పుడు వీటన్నింటినీ ఒక గిన్నెలోకి తీసుకొని అందులో 100 గ్రాములు ఆవ నూనె వేయాలి. ఆ తర్వాత స్టవ్ పై పెట్టి కొంచెం మరగనివ్వాలి. దీనిని స్టవ్ పై కాకుండా బాగా ఎండ పడే చోటు పెట్టిన సరిపోతుంది. ఇలా తయారైన నూనెను మన జుట్టుకు కుదుళ్ల నుంచి చివర్ల వరకు బాగా అప్లై చేసి పది నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఇలా చేసిన తర్వాత రెండు గంటల తర్వాత తల స్నానం చేయాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. అలాగే ఊడిన జుట్టు దగ్గర ఒత్తుగా జుట్టు పెరగడం మొదలవుతుంది.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp