Hair Tips : ఈ చిట్కా ట్రై చేశారంటే… చిటికెలో తెల్ల జుట్టు నల్లగా మారుతుంది
Hair Tips : ప్రస్తుతం చాలామంది వయసుతో సంబంధం లేకుండా తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. కొంతమందికి తెల్ల వెంట్రుకలు వస్తే నలుగురిలో వెళ్లి మాట్లాడడానికి ఫీలవుతూ ఉంటారు. తెల్ల వెంట్రుకలు పోవడానికి మార్కెట్లో దొరికే వివిధ రకాల ప్రొడక్ట్స్ ను ఉపయోగిస్తూ ఉంటారు. మార్కెట్లో దొరికే హెయిర్ కలర్స్ ను ఉపయోగించడం వల్ల నల్ల వెంట్రుకలు కూడా తెల్లగా మారిపోతాయి. అంతేకాకుండా వీటి వలన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంట్లో దొరికే వాటితో హెయిర్ డైస్ ట్రై చేసినట్లయితే తెల్ల వెంట్రుకలు రావడం తగ్గిపోతాయి.
ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో మీరు ఉపయోగించే షాంపూను మూడు స్పూన్ల దాకా వేసుకోవాలి. తర్వాత ఇందులో రెండు స్పూన్ల అలోవెరా జెల్ వేసుకోవాలి.. మార్కెట్లో దొరికే అలోవెరా జెల్నైనా వాడుకోవచ్చు. ఈ రెండింటిని బాగా కలిపి కొద్దిసేపు ప్రక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక కడాయి తీసుకుని అందులో మూడు స్పూన్ల టీ పొడి వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. తర్వాత దీన్ని రోలులో వేసి మెత్తగా పొడి లాగా చేసుకోవాలి.
ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న షాంపూలో వేసి బాగా కలుపుకోవాలి. ఇది జుట్టు నల్లబడటం లో చాలా బాగా పనిచేస్తుంది. అలాగే జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగటంలో సహాయపడుతుంది. దీనికోసం మార్కెట్లో దొరికే మందార పొడిని లేదా ఇంట్లో తయారు చేసుకున్న మందారపొడినైనా ఉపయోగించవచ్చు. వీటన్నింటినీ బాగా కలిపి కొంచెం గట్టిగా ఉంటే వాటర్ వేసుకుని బాగా కలిపి జుట్టుకి అప్లై చేసుకునే విధంగా చేసుకోవాలి. ఈ పేస్టును జుట్టు కుదర్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసికోవాలి. ఈ పేస్టు జుట్టు కుదుర్ల నుంచి చివర్ల దాకా రాసి ఒక గంట తర్వాత నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేస్తే తెల్ల వెంట్రుకలు నల్లగా మారిపోతాయి. కొత్తగా తెలవెంట్రుకలు రాకుండా ఉంటాయి.