Hair Tips : తెల్లజుట్టును నల్లగా నిగనిగలాడేలా చేసే అద్భుతమైన చిట్కాలు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hair Tips : తెల్లజుట్టును నల్లగా నిగనిగలాడేలా చేసే అద్భుతమైన చిట్కాలు..!

 Authored By pavan | The Telugu News | Updated on :15 March 2022,6:00 pm

Hair Tips : ఈ మధ్య చాలా మందికి తెల్ల వెంట్రుకలు వచ్చేస్తున్నాయి. 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వయసున్న వారిలో తెల్ల వెంట్రుకలు కనిపిస్తున్నాయి. వృద్ధాప్యం రాకముందే ఇ కనిపించేందుకు ముఖ్య కారణం ఒత్తిడి. అలాగే వేలకు వేలు తగిలేస్తూ.. వాడే షాంపూలు, నూనెలు కూడా కారణమే. అయితే ఎక్కువ డబ్బులు పెట్టి కొనే వాటి వల్ల జుట్టు బాగవతుందని చాలా మంది భావిస్తుంటారు. కానీ వాటి వల్ల జుట్టు పాడవడం, రంగు కోల్పోవడం అలాగే జుట్టు నీర్జీవంగా మారడం ఎక్కువగా కనిపిస్తుంటుంది. అంతే కాదండోయ్ షాంపూలు, నూనెల్లో వాడే కెమికల్స్ వల్ల అనేక రకాల దుష్ప్రభావాలు ఉంటాయి. అయితే తెలుపు రంగును కవర్ చేసుకునేందుకు జుట్టుకు వేసే రంగుల్లో కూడా ఎక్కువ మొత్తంలో కెమికల్స్ ఉంటాయి.

అయితే ఇలాంటివి వాడకుండా సహజమైన పద్ధతిలోనే మన తెల్ల జుట్టు నల్లగా నిగనిగలాడేలా కనిపించాలంటే ఈ చిట్కా పాటించాల్సిందే. అయితే ఆ చిట్కా ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.ఉసిరికాయలు.. అయితే వీటి వల్ల జుట్టు పెరుగుతుంది, బలంగా తయారవుతుంది, ఆరోగ్యంగా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే మనకు ఇవి ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు కాబట్టి సీజన్ అప్పుడే వీటిని కొనుక్కోవాలి. చిన్న చిన్న ముక్కులుగా కట్ చేసుకొని ఎండబెట్టుకోవాలి. ఆ తర్వాత వాటిని పొడి చేసి ఉంచుకోవాలి. ఈ పొడిని ఏడాది పాటు వాడుకోవచ్చు. అయితే మనకు ఉసరికాయలు దొరికినప్పుడు మాత్రం అంటే పచ్చివి ఉంటే మాత్రం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక పాన్ లో వేసుకొని వేయించుకోవాలి. అవి నల్లగా అయ్యాకా వాటిని మిక్సీలో వేసుకొని మెత్తని పొడిలా చేసుకోవాలి.ఈ పొడిలో నాలుగైదు చుక్కల ఆలివ్ అయిల్ వేసుకొని తలకు అప్లై చేసుకోవాలి.

Hair Tips in best remedy for white hair get black

Hair Tips in best remedy for white hair get black

ఆరిన తర్వాత మైల్డ్ ఫాంపూతో తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల తెల్ల జుట్టు నలుపు రంగులోకి మారుతుంది. అంతే కాకుండా జుట్టు రాలే సమస్య కూడా తగ్గిపోతుంది. ఆలివ్ ఆయిల్ జుట్టును తేమగా ఉంచడం, నల్లగా,దృఢంగా మార్చడంలో సాయపడుతుంది. ఆలివ్ ఆయిల్ అందుబాటులో లేని వారు కొబ్బరి నూనెను కూడా వాడచ్చు. అలాగే గుప్పెడు కరివేపాకులు తీసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఇది మునిగే వరకు నూనె పోసి ఒక రోజంతా అలాగే వదిలేయాలి. ఎండలో కాసేపు ఉంచినా మంచిదే.. ఎండ లేని వారు డబులు బాయిలింగ్ పద్దతిలో వేడి చేసుకొని ప్రతిరోజూ తలకు రాసుకోవాలి. ఈ రెండు చిట్కాల వల్ల జుట్టు పొడవుగా, బలంగా, దృఢంగా, నల్లగా అవుతుంది.

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది