Hair Tips : కేవలం రెండు చుక్కలు చాలు .. జుట్టు గడ్డి లాగా పెరుగుతుంది..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hair Tips : కేవలం రెండు చుక్కలు చాలు .. జుట్టు గడ్డి లాగా పెరుగుతుంది..!

 Authored By aruna | The Telugu News | Updated on :18 June 2023,2:00 pm

Hair Tips : ప్రస్తుతం మారిన జీవన శైలి కారణంగా చాలామంది జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. చిన్న వయసుల వారు కూడా తెల్ల జుట్టు సమస్యను ఎదుర్కొంటున్నారు. వీటిని తొలగించేందుకు వివిధ రకాల చిట్కాలను ఫాలో అవుతూ ఉంటారు. ఆ కలర్ ఈ కలర్ వేసుకుంటూ జుట్టును ఇంకా పాడు చేసుకుంటున్నారు. అయితే అలాంటివారికి ఈ హెయిర్ ఆయిల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ హెయిర్ ఆయిల్ తయారు చేయడానికి కేవలం రెండు ఇంగ్రిడియంట్స్ చాలు. ముందుగా కరివేపాకు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే జుట్టుకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది.

కరివేపాకులో విటమిన్ ఏ, బి, సి, క్యాల్షియం, అమైనో యాసిడ్స్ ఫాస్పరస్ ఐరన్ వంటివి సమృద్ధిగా ఉంటాయి. జుట్టు కురులను బలంగా ఉంచడంలో కరివేపాకు బాగా పనిచేస్తుంది. అలాగే డ్యామేజ్ అయిన జుట్టును కూడా రిపేర్ చేస్తాయి. కేవలం తెల్ల జుట్టు మాత్రమే కాదు జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది. కరివేపాకు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాలను తగ్గిస్తుంది. అయితే కరివేపాకులో ఉండే బీటా కెరోటిన్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని అందులో రెండు కప్పుల కొబ్బరి నూనె వేసుకోవాలి. మంటను సిమ్ లో ఉంచి కరివేపాకు రెబ్బలు శుభ్రం చేసుకొని ఆరబెట్టుకోవాలి.

Hair

Hair

ఇప్పుడు ఒక కప్పు కరివేపాకు తీసుకొని ఆయిల్లో వెయ్యాలి. స్లోగా కలుపుకొని తర్వాత ఇందులో ఒక స్పూన్ ఉసిరికాయ పౌడర్ లేదంటే కలోంజి సీడ్స్ వేసుకోవాలి. తరువాత ఇందులో రెండు స్పూన్ల అచ్చాపచ్చాగా దంచుకున్న మెంతులను వేసుకోవాలి. పది పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో మరిగించి కలర్ మారాక దించేసుకోని కొద్దిసేపు చల్లారనివ్వాలి. తర్వాత ఒక గాజు సీసాలోకి వడకట్టుకోవాలి. వారానికి రెండుసార్లు ఈ ఆయిల్ అప్లై చేస్తే రెండు నెలల్లోనే తెల్ల జుట్టు నల్లగా అవుతుంది. అంత అద్భుతంగా ఈ ఆయిల్ పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ చిట్కాను ట్రై చేసి చూడండి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది