Hair Tips : గ్లిజరిన్ తో జుట్టు సమస్యలకు చెక్ పెట్టండి ఇలా…!
Hair Tips : గ్లిజరిన్ బ్యూటీ కేర్ ఉత్పత్తులలో ఎక్కువగా ఉపయోగిస్తారు. షాంపూలు, కండిషనర్లు, సబ్బులు, బాడీ లోషన్లు మొదలైన వాటిలో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. వాతావరణం నుండి తేమను తీసి జుట్టులో ఉంచడానికి గ్లిజరిన్ సహాయపడుతుంది. గ్లిజరిన్ స్కాల్ప్ కు తేమను అందించి ఆరోగ్యవంతమైన జుట్టును ప్రోత్సహిస్తుంది. గ్లిజరిన్ ను ప్రతిరోజు ఉపయోగించడం వలన తల పొడి బారడం మరియు దురదను నివారించవచ్చు. అలాగే చుండ్రు సమస్యను కూడా ఈజీగా వదిలించుకోవచ్చు. జుట్టుకు పోషణ కోసం హెయిర్ వాష్ తర్వాత గ్లిజరిన్ హెయిర్ స్ప్రే ని ఉపయోగించాలి. దీనికోసం ముందుగా స్ప్రే బాటిల్, నీరు, రోజ్ వాటర్ ఎసెన్షియల్ ఆయిల్స్, గ్లిజరీ అవసరం.
ఒక కంటైనర్ లో ముప్పావు వంతు నీరు నింపి అరకప్పు రోజు వాటర్ వేసి రెండు మూడు చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ వేసి రెండు టేబుల్ స్పూన్ల గ్లిజరిన్ వేసి బాగా షేక్ చేయాలి. దీన్ని జుట్టును తడిచేసి జుట్టు మీద అప్లై చేయాలి. తర్వాత జుట్టు దువ్వెన చేయడం వలన పొడిబారిన చిట్లిన జుట్టుకు పోషణ లభిస్తుంది. అలాగే జుట్టుకు గ్లిజరిన్ మరియు గుడ్డు హెయిర్ మాస్క్ వేసుకోవాలి. దీనికోసం ఒక గుడ్డు ఒక టేబుల్ స్పూన్ తేనె ఒక టేబుల్ స్పూన్ గ్లిజరిన్ తీసుకొని కలపాలి. హెయిర్ బ్రష్ ని ఉపయోగించి సమానంగా అప్లై చేయాలి. 30 నిమిషాల తర్వాత షాంపూ కండిషనర్ తో జుట్టుని బాగా కడగాలి.
గ్లిజరిన్ తేనె మాస్క్ వేయడం కోసం ముందుగా సమాన పరిమాణంలో తేనే మరియు గ్లిజరిన్ కలపాలి. హెయిర్ బ్రష్ ఉపయోగించి జుట్టుకు సమానంగా అప్లై చేయాలి. 30 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ గ్లిజరిన్ లో రెండు టేబుల్ స్పూన్ల కలబంద గుజ్జు వేసి మూడు నాలుగు నిమిషాల పాటు తలకు స్మూత్ గా మసాజ్ చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన జుట్టు రాలడం తగ్గుతుంది మరియు జుట్టు కూడా బాగా పెరుగుతుంది. అలాగే ఆముదం మరియు గ్లిజరిన్ తో మాస్క్ చేసుకుంటే జుట్టు మృదువుగా మరియు తేమగా ఉంటుంది. అలాగే జుట్టు స్మూత్ గా, పొడవుగా పెరుగుతుంది.