Hair Tips : ఈ మూడు పదార్థాల్ని నీటిలో కలిపి తలకి పట్టించండి… పొడువాటి, ఒత్తయిన జుట్టు మీ సొంతం అవుతుంది…!
Hair Tips : చాలామందిలో జుట్టు రాలే సమస్యతో ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ సమస్య పరిష్కరించుకోవడం కోసం ఎన్నో రకాల కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ ని వాడుతూ ఉంటారు. కానీ ఎటువంటి ప్రయోజనం ఉండదు. సహజంగా జుట్టు ఎదగడానికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దాన్లో భాగంగా తలస్నానం చేసే నీటిలో కొన్ని పదార్థాలను కలిపి జుట్టు శుభ్రం చేయడం వలన జుట్టు విడుదలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది జుట్టు దెబ్బ తినకుండా రక్షిస్తుంది.
జుట్టు ఎదుగుదల సంరక్షణ కోసం కొన్ని చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం..బియ్యం కడిగిన నీళ్లు : ఈ బియ్యం కడిగిన నీళ్లను జుట్టుకి చాలా బాగా సహాయపడుతుంది. కావున బియ్యాన్ని నానబెట్టండి. తర్వాత ఆ నీటినితో మీ జుట్టు ని బాగా శుభ్రం చేయండి. ఇది జుట్టుని బలోపితమ్ చేయడమే కాకుండా జుట్టు ఎదుగుదలని కూడా ప్రోత్సహించడంలో బాగా సహాయపడుతుంది.
నిమ్మకాయ : ఈ నిమ్మకాయ నీటిని వాడడం వలన జుట్టు ఎదుగుదల చాలా బాగుంటుంది. నీటిలో నిమ్మకాయ రసం పిండి ఈ నీటితో మీ జుట్టుని వారానికి రెండుసార్లు లేదా మూడుసార్లు శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వలన జుట్టు ఎదగడమే కాకుండా జుట్టు బలంగా తయారవుతుంది.
అవిసె గింజలు : అవిసె గింజల నీటిలో విటమిన్ ప్రోటీన్ రెండు కూడా అధికంగా ఉంటాయి. కావున అవిస గింజల నీటితో జుట్టుని కడిగితే జుట్టు ఎదుగుతుంది. దీనికోసం రెండు టేబుల్ స్పూన్ల ఆవిస గింజలను రెండు గ్లాసుల నీటిలో నానబెట్టి దానిని వడకట్టి మరుసటి రోజు మీ జుట్టుని కడగాలి. ఈ విధంగా చేయడం వలన ఎన్నో రకాల జుట్టు సమస్యలు తగ్గిపోతాయి…