Hair Tips : షాంపూ హెయిర్ గ్రోత్ సీక్రెట్… రఫ్ హెయిర్ స్మూత్ గా అవుతుంది.. చుండ్రు తగ్గుతుంది.. ఒక్కసారి కే జుట్టు ఊడటం ఆగిపోతుంది..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hair Tips : షాంపూ హెయిర్ గ్రోత్ సీక్రెట్… రఫ్ హెయిర్ స్మూత్ గా అవుతుంది.. చుండ్రు తగ్గుతుంది.. ఒక్కసారి కే జుట్టు ఊడటం ఆగిపోతుంది..!

 Authored By prabhas | The Telugu News | Updated on :9 December 2022,3:30 pm

Hair Tips : చాలామంది ఇప్పుడున్న వాతావరణం పరిస్థితి వలన జుట్టు రాలే సమస్యలు రోజురోజుకీ ఎక్కువవుతున్నాయి. అయితే ఈ సమస్య పొల్యూషన్ కారణంగా కూడా అధికమవుతుంది. ఈ సమస్య నుంచి బయటపడడం కోసం ఇప్పుడు మనం తయారు చేసే చిట్కా చాలా బాగా సహాయపడుతుంది అదేవిధంగా జుట్టు ఊడే సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. దీనికోసం వాడేవి అన్ని ఇంట్లో వినియోగించేవి కనుక ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలగవు కావున ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు..
ఈ చిట్కాని ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం.. దానికోసం మనం ఏదైనా బయోటిక్ షాంపూ లేదా గాఢత తక్కువ గల షాంపును వాడవలసి ఉంటుంది.

ఇది ఎక్కువ ఖరీదని మనం భయపడుతూ ఉంటాము.. కానీ మైల్డ్ షాంపూ లాగానే ఇది కూడా ధర తక్కువ ఉంటుంది. అయితే దీనికి వాడడం వలన మన జుట్టు అస్సలు హాని చేయదు. కావున ప్రతి ఒక్కరు బయోటిక్ లేదా గాడ్త తక్కువ గల షాంపుని వినియోగించాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో మన జుట్టుకి సరిపోయేంత షాంపూ ని తీసుకోవాలి. ఇప్పుడు దీనిలో సగం చెక్క నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వేయడం వలన దీనిలో ఉండే విటమిన్ సి ప్రభావం వలన చుండ్రు తగ్గిపోతుంది. అలాగే హెయిర్ కి మంచి గ్రోత్ కూడా ఉంటుంది. ప్రస్తుతం దీనిలో ఒక స్పూన్ ఏదైనా కాఫీ పౌడర్ వేసి కలుపుకోవాలి. కాఫీ పౌడర్ మన జుట్టుకి మరియు చర్మానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.

Hair Tips on Shampoo is the hair growth secret

Hair Tips on Shampoo is the hair growth secret

అలాగే మన జుట్టుకి న్యాచురల్ కలర్ లాగా కూడా సహాయపడుతుంది. ఇప్పుడు దీనిలో ఒక గ్లాస్ ప్యూర్ వాటర్ ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న మిశ్రమాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో చూద్దాం.. దీనికోసం ముందుగా మన జుట్టుకి బాగా ఆయిల్ ని అప్లై చేయాలి. ఈ విధంగా చేయడం వలన మన హెయిర్ మాచరైజర్గా తయారవుతుంది. తర్వాత ఇప్పుడు కలుపుకున్న మిశ్రమం జుట్టుకి బాగా అప్లై చేయాలి. ఈ అప్లై చేసిన తర్వాత ఒక 45 మినిట్స్ ఉంచుకొని తర్వాత తల స్నానం చేయాలి. ఈ విధంగా వారానికి మూడుసార్లు చేయడం వలన జుట్టు స్మూత్ గా తయారవుతుంది. అలాగే జుట్టు చాలా ఆరోగ్యంగా ఉంటుంది. జుట్టు ఊడటం కూడా తగ్గిపోతుంది. అలాగే చుండ్రు నుంచి మంచి ఉపశమనం పొందవచ్చు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది