Hair Tips : చుండ్రు సమస్య వేధిస్తోందా.. అయితే ఇలా చేసి చూడండి.. చుండ్రు పారాహుషార్
Hair Tips : నేటి రోజుల్లో చాలా మంది జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. ఇలా జుట్టు సమస్యలు వచ్చేందుకు ప్రధాన కారణం నేటి వాతావరణమే అని కొంత మంది చెబుతున్నారు. ఈ సమస్యల నుంచి బయటపడేందుకు చాలా మంది రకరకాల ఆయిల్స్, మరియు షాంపూస్, కండీషనర్స్ ట్రై చేస్తూ ఉంటారు. కానీ వాటి వల్ల చాలా మందికి ఎక్కువగా ప్రయోజనాలు కనిపించవు. కాబట్టి వాటిని కొని చాలా మంది అలసిపోతారు. కానీ పాత రోజుల్లో మన పెద్దలు వాడిన సింపుల్ చిట్కాను ఉపయోగించి జుట్టులో ఉన్న చుండ్రు సమస్య, కొసలు పగలడం, రాలడం వంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చు.
ఈ సమస్యలకు పాత కాలం నాటి పద్ధతులను ఉపయోగించి ఎలా చెక్ పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.మన జుట్టులో చుండ్రు సమస్య వేధిస్తుంటే మనకు విరివిగా లభించే గోరింటాకు సాయంతో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు. వేడి నీటిలో గుప్పెడు గోరింటాకు బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత గోరింటాకు తీసుకుని మిక్సీలో వేసి ఒక స్పూన్ ఆవనూనె, రెండు స్పూన్ల పెరుగుతో బాగా పట్టాలి. ఇలా ఆ మిశ్రమాన్ని బాగా మిక్సీ చేసిన తర్వాత ఈ మిశ్రమానికి గోరింటాకును మరిగించిన నీటిని కలపాలి.
అంతే కాకుండా ఈ మిశ్రమంలో రెండు స్పూన్ల ఉసిరి పొడి అది లేకపోతే రెండు స్పూన్ల బృంగ్రాజ్ లేదా మందార పొడి కలపాలి. వీటిని బాగా కలిపి ఈ మిశ్రమాన్ని తీసుకుని జుట్టు కుదుళ్ల నుంచి చివరి వరకు బాగా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసిన తర్వాత ఒక 40 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత జుట్టును శుభ్రం చేసుకోవాలి. ఆ రోజు జుట్టుకు షాంపూ కానీ కండీషనర్ కానీ అప్లై చేయకూడదు. మీకు కావాలంటే నెక్ట్స్ డే అప్లై చేసుకోవచ్చు. ఇలా నెలకు ఒకసారి కానీ రెండు సార్లు కానీ ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేస్తే మీకు చుండ్రు సమస్య నుంచి, పగలడం సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.