Hair Tips : ఈ ఆకులతో హెయిర్ ఫాల్ కు చెక్.. అయితే ఇలా మాత్రం అస్సలు చేయకండి!!
Hair Tips : వాతావరణ కాలుష్యం, పోషకాహార లోపం, మానసిక ఆందోళన వల్ల చాలామందికి జుట్టు విపరీతంగా రాలిపోతుంది. స్త్రీ, పురుషులు అనే బేధం లేకుండా చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఈ రోజుల్లో జుట్టు రాలడం అనేది ఒక సాధారణ సమస్యగా మారింది. రకరకాల షాంపోలు వాడటం వల్ల కూడా హెయిర్ పొడి బారీ తొందరగాఫాల్ అవుతుంది. అందుకే సహజ సిద్దంగా ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలు పాటించి జుట్టు రాలడాన్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలుసుకుందాం.గోరు వెచ్చని ఆలివ్ ఆయిల్‌ని జుట్టుకు, కుదుళ్లకు బాగా పట్టించి కొద్దిసేపు వేచి ఉండాలి.
తర్వాత తలస్నానం చేయాలి. లేదంటే ఆలివ్ ఆయిల్‌ను రాత్రిపూట జుట్టుకు రాసుకుని మరుసటి రోజు ఉదయాన్నే తలస్నానం చేసినా సరిపోతుంది. వారానికి రెండు సార్లు ఈ విధంగా ప్రయత్నిస్తే జుట్టు పెరుగుదలలో ఆశించిన ఫలితాలు వస్తాయి. అలాగే ఒత్తిడి తగ్గించుకోగలిగితే చాలా జుట్టు సమస్యలు తగ్గుతాయి. రోజూ మెడిటేషన్ చేయడం వల్ల మీలోని ఒత్తిడిని తగ్గించుకుంటే జుట్టు రాలడాన్ని కూడా నివారించొచ్చు.హెయిర్ ఫాల్ కు మందార, జామ ఆకులు చక్కటి ఔషదాలు. జామ ఆకులలో విటమిన్ బీ6 అధికంగా ఉంటుంది. ఇది కుదుళ్లను బలంగా చేస్తుంది. అలాగే వైట్ హెయిర్ బ్లాక్ అవడానికి సహాయపడుతుంది.
Hair Tips : ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి
మందార ఆకులు చుండ్రు, జుట్టురాలడాన్ని నివారిస్తుంది. కరివేపాకులలో కూడా చక్కటి ఔషద గుణాలు ఉన్నాయి. ముందుగా మందార, జామ, కరివేపాలకులను రెండు చొప్పున తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడగాలి. అలాగే రెండు స్పూన్ల మెంతులు తీసుకుని వీటన్నింటిని మిక్సీలో వేసి వాటర్ పోయకుండా పేస్ట్ లా చేసుకోవాలి. ఈ మిశ్రమానికి ఒక కప్ కొబ్బరి నూనే కలిపి కలర్ మారేంతవరకు మరిగించాలి. చల్లారిన తర్వాత ఫిల్లర్ చేసుకోవాలి. గోరువెచ్చగా ఉండగా ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు జుట్టుకు అప్లై చేసుకోవాలి.ఒక గంట తర్వాత తలస్పానం చేయాలి. ఈలా వారానికి రెండు సార్లు ట్రై చేస్తే చక్కటి ఫలితాలు చూడవచ్చు.